Wuhan: వుహాన్ నగర ప్రజలందరికీ మళ్లీ వైరస్ పరీక్షలు..

బీజింగ్: వుహాన్ ( Wuhan ) నగర ప్రజలందరికీ మళ్లీ కరోనా వైరస్ పరీక్షలు చేపట్టనున్నారు. ఏడాది క్రితం చైనాలోని వుహాన్‌లోనే తొలుత కరోనా ( Corona Virus ) కేసులు ప్రబలిన విషయం తెలిసిందే. వుహాన్ నగరంలో సుమారు కోటిన్నర మంది నివాసితులు ఉన్నారు. అయితే వారందరికీ సమగ్ర న్యూక్లిక్ యాసిడ్ పరీక్షలు చేయనున్నట్లు ఆ నగర అధికారి లీ టావో తెలిపారు. నగరంలో ఉన్న ఏడు మంది వలస కార్మికులకు మళ్లీ వైరస్ సంక్రమించినట్లు గుర్తించారు. ఇటీవల మళ్లీ వైరస్ కేసులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో చైనాలోని అన్ని నగరాల్లోనూ ఆంక్షలను కఠినతరం చేశారు. వేగంగా విస్తరిస్తున్న డెల్టా వేరియంట్‌ను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నది. మంగళవారం కొత్తగా 61 కేసులు నమోదు అయ్యాయి. బీజింగ్‌తో పాటు అన్ని ప్రధాన నగరాల్లో వైరస్ పరీక్షల జోరును పెంచారు. యాంగ్జూ నగరంలో ఉన్న 13 లక్షల మంది పౌరులను ఇండ్లకే పరిమితం చేశారు. ప్రతి ఇంటి నుంచి ఒక్కరికి మాత్రమే బయటకు వెళ్లే అవకాశం కల్పించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

