బీజింగ్: రెండు నెలలుగా కనిపించకుండా పోయిన రక్షణ మంత్రి లీ షాంగ్ఫూను చైనా ప్రభుత్వం పదవి నుంచి తొలగించింది. మార్చిలో లీ ఈ పదవిలో నియమితులయ్యారు. ఆగస్టు 29న ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఆ తర్వాత బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు.
గతంలో ఇదే విధంగా అదృశ్యమైన విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ను జూలైలో ఆ పదవి నుంచి తొలగించారు. వీరిద్దరి తొలగింపునకు కారణాలను వెల్లడించలేదు. జిన్పింగ్ అధికారాన్ని వీరిద్దరూ ప్రశ్నించినట్లు తెలుస్తున్నది.