బీజింగ్, సెప్టెంబర్ 30: ఎలాన్‌మస్క్ కంపెనీ స్పేస్ఎక్స్తో చైనా పోటీకి దిగింది. విస్తృత బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న స్టార్‌లింక్‌కు పోటీగా జీ60 స్టార్‌లింక్‌ను ఆ దేశం అభివృద్ధి చేస్తున్నది. దిగువ భూ కక్ష్యలో 12 వేల శాటిలైట్లను ఉంచేలా చైనా పరిశోధకులు దీన్ని తయారు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో పురోగతి సాధించినట్టు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని గువో వాంగ్లో కంపెనీ దీన్ని అభివృద్ధి చేస్తున్నది. కాగా, స్పేస్ ఎక్స్‌కు చెందిన స్టార్‌లింక్ 13 వేల శాటిలైట్ల సాయంతో సేవలు అందిస్తున్నది.