చైనా ఎవరిపై ఆధిపత్యాన్ని ఆశించదు: జిన్‌పింగ్

బీజింగ్: యూఎన్ జనరల్ అసెంబ్లీ 76వ సమావేశాలను ఉద్దేశిస్తూ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ వీడియో లింక్ ద్వారా మాట్లాడారు. అమెరికాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ.. రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలను.. సంప్రదింపులు, సహకారంతో పరిష్కరించుకోవాలన్నారు. ఘర్షణాత్మక వాతావరణం మంచిది కాదు అని ఆయన ప్రపంచ దేశాధినేతలను ఉద్దేశిస్తూ తెలిపారు. శాంతి, అభివృద్ధి, సమానత్వం, న్యాయం, ప్రజాస్వామ్యం, స్వాతంత్య్రం లాంటి అంశాలపై ప్రపంచం దృష్టి పెట్టాలని, కానీ చిన్నపాటి సర్కిళ్లను గీసి వాటిలో ఉండడాన్ని మానుకోవాలన్నారు. సమానత్వం, పరస్పర గౌరవం ఉంటే, రెండు దేశాల మధ్య గొడవలే ఉండవన్నారు. ఒక దేశం అభివృద్ధి వల్ల మరో దేశం విఫలం అయినట్లు కాదు అని జిన్‌పింగ్ అన్నారు. చైనాతో కొత్తగా ప్రచ్ఛన్నయుద్ధానికి తెరలేపేది లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కామెంట్ చేసిన నేపథ్యంలో జీ జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
అంతర్జాతీయ వ్యవహారాల్లో అభివృద్ధి చెందిన దేశాల ప్రాతినిధ్యాన్ని పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. స్థిరమైన అంతర్జాతీయ వ్యవస్థను నెలకొల్పేందుకు యూఎన్ కట్టుబడి ఉండాలన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. బయటి దేశాల సైనిక చర్యతో నష్టమే ఉంటుందన్నారు. చైనా ఎన్నడూ ఏ దేశ ఆక్రమణకు వెళ్లలేదని, ఎవరిపైనా ఆధిపత్యాన్ని చెలాయించదని జిన్‌పింగ్ తెలిపారు. చైనా ప్రజలు ఎప్పుడూ శాంతి, సామరస్యాన్ని కోరుకుంటారని అధ్యక్షుడు జిన్‌పింగ్ తెలిపారు. ప్రపంచ శాంతిని నిర్మించేందుకు చైనా ఎప్పుడు తన వంతు పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

