బీజింగ్, సెప్టెంబర్ 19: గాలిలో ఎగిరే కారును చైనా విజయవంతంగా పరీక్షించింది. అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించి కండక్టర్ రైల్పై ఈ కారు ఎగురుతూ, 230 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. సిచువాన్ ప్రావిన్స్ చెంగ్డులోని నైరుతి జియాటాంగ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు దీనిని అభివృద్ధి చేశారు. బలమైన అయస్కాంతాలను కార్లకు దిగువన అమర్చి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ట్రాక్‌పై పరుగులు పెట్టించారు. ఇది భూమి నుంచి 35 మిల్లీమీటర్ల ఎత్తులో ఎగిరిందని పేర్కొన్నారు.