తైవాన్ వైమానిక క్షేత్రంలోకి 30 యుద్ధ విమానాలను పంపిన చైనా
బీజింగ్: తైవాన్, చైనా మధ్య మళ్లీ టెన్షన్ వాతావరణం మొదలైంది. తైవాన్ వైమానిక దళంలోకి చైనా 30 యుద్ధ విమానాలను పంపినట్లు తెలుస్తోంది. సోమవారం ఈ ఘటన చోటుచేసుకున్నది. అయితే చైనా చర్యకు దీటుగా యుద్ధ విమానాలను మోహరించినట్లు తాజాగా తైవాన్ వెల్లడించింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తైవాన్ విషయంలో చైనాను హెచ్చరించిన విషయం తెలిసిందే. తైవాన్ పరిసర ప్రాంతాల్లో చైనా తన వైమానిక కార్యకలాపాలను పెంచింది. అయితే సైనిక శిక్షణ చేపడుతున్నట్లు ఆ దేశం చెబుతున్నా.. తైవాన్ మాత్రం సందేహాలు వ్యక్తం చేస్తోంది. దీంతో రెండు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. తైవాన్ వైమానిక రక్షణ క్షేత్రంలో ఉన్న ప్రటాస్ దీవుల వద్దకు చైనా యుద్ధ విమానాలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంట్లో 22 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. తమ వైమానిక క్షేత్రంలోకి చైనా విమానాలు వస్తున్నట్లు చాన్నాళ్ల నుంచి తైవాన్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

