బీజింగ్: చైనాలో బర్డ్ ఫ్లూ (Bird Flu) కలకలం సృష్టిస్తున్నది. బర్డ్ ఫ్లూకి చెందిన హెచ్3ఎన్8 రకం లక్షణాలను మనుషుల్లో గుర్తించారు. ఇలా వైరస్ మానవులకు సంక్రమించడం చైనాలో ఇదే మొదటిసారి. దేశంలోని హెనాన్ ప్రావిన్స్‌లో నాలుగేండ్ల బాలుడికి బర్డ్ ఫ్లూ వైరస్ సోకిందని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ (NHC) ప్రకటించింది. అతడు జర్వంతోపాటు ఇతర లక్షణాలతో బాధపడుతున్నాని అధికారులు వెల్లడించారు.
అయితే బాధితునితో ఉన్నవారికి ఆ వైరస్ సోకలేదని తెలిపారు. అదేశంగా ఇది ప్రజల్లో వ్యాప్తి చెందే అవకాశం తక్కువగా ఉందని స్పష్టం చేశారు. బాధితుని ఇంట్లో పెంపుడు కోళ్లు, కాకులు ఉన్నాయని.. వాటివల్లే H3N8 వేరియంట్ అతనికి సోకిందని చెప్పారు.
కాగా, ఇప్పటివరకు ప్రపంచంలో మరెక్కడా గుర్రాలు, కుక్కలు, పక్షులు, సీల్స్‌లో H3N8 వేరియంటును గుర్తించలేదని ఎన్‌హెచ్‌సీ తెలిపింది. మానవులకు సోకే సామర్థ్యం ఈ వైరస్‌కు ఇంకా రాలేదని ప్రాథమికంగా నిర్ధారించింది.