China Defence Minister | రక్షణ శాఖ మంత్రి తొలగించిన చైనా.. అదృశ్యమైన రెండు నెలలకు కీలక నిర్ణయం
China Defence Minister | చైనా రక్షణ శాఖ మంత్రి జనరల్ లీ షాంగ్ ఫూను జిన్‌పింగ్ సర్కార్ పదవి నుంచి తొలగించింది. ఆయన అదృశ్యమైన దాదాపు రెండు నెలల తర్వాత చైనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది.
China Defence Minister | చైనా రక్షణ శాఖ మంత్రి జనరల్ లీ షాంగ్ ఫూను జిన్‌పింగ్ సర్కార్ పదవి నుంచి తొలగించింది. ఆయన అదృశ్యమైన దాదాపు రెండు నెలల తర్వాత చైనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. లీ షాంగ్ ఫూ ఉద్వాసనకు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపిందని పేర్కొంది. అయితే లీ షాంగ్ ఫూను ఎందుకు పదవి నుంచి తొలగించారు? ఆయన స్థానంలో ఎవర్ని నియమించారనే విషయాలను మాత్రం బయటపెట్టలేదు.
జిన్‌పింగ్ ప్రభుత్వంలో రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న లీ షాంగ్ ఫూ అదృశ్యం కావడం రెండు నెలల కిందట కలకలం సృష్టించింది. ఆగస్టు 29న బీజింగ్‌లో జరిగిన చైనా – ఆఫ్రికా పీస్ అండ్ సెక్యూరిటీ ఫోరంలో ఆయన చివరిసారిగా కనిపించారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) హార్డ్‌వేర్ ప్రొక్యూర్‌మెంట్‌కు సంబంధించిన అవినీతి కేసులపై విచారణ జరుగుతున్న తరుణంలో ఆయన కనిపించకుండా పోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే లీ షాంగ్ ఫూ కనిపించకుండా పోవడానికి కొద్దిరోజుల ముందు ఇలాగే చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్ అదృశ్యమయ్యారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆయన్ను పదవిలో నుంచి తీసేసి.. ఆ బాధ్యతలను వాంగ్ యీకి అప్పగించారు. ఇప్పుడు లీ షాంగ్ ఫూ మాయమైన రెండు నెలలకు ఆయన్ను రక్షణ శాఖ మంత్రి బాధ్యతల నుంచి తొలగించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

