G20 Summit: జీ20 సమావేశాలకు జిన్‌పింగ్ డుమ్మా.. నిరాశ వ్యక్తం చేసిన బైడెన్
G20 summit: ఢిల్లీలో జరిగే జీ20 సమావేశాలకు జిన్‌పింగ్ హాజరుకావడం లేదు. ఇది నిరాశాజనకమైన విషయమని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అన్నారు. అయినా తాను సమావేశాలకు వెళ్లనున్నట్లు చెప్పారు. భారత్, చైనా మధ్య ఇటీవల ఉద్రిక్తత నెలకొన్న విషయంలో జిన్‌పింగ్ ఆ మీటింగ్‌కు డుమ్మాకొడుతున్నట్లు తెలుస్తోంది.
న్యూఢిల్లీ: ఢిల్లీలో జరగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశాల(G20 Summit)కు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ డుమ్మా కొట్టే అవకాశాలు ఉన్నాయి. ఆయన ఆ సదస్సుకు హాజరయ్యే అవకాశాలు లేవని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. జిన్‌పింగ్ గైర్హాజరు తనను నిరాశకు లోను చేస్తుందన్నారు. ఢిల్లీలో జరిగే సమావేశాల్లో పాల్గొనేందుకు 8వ తేదీన బైడెన్ ఇండియాకు రానున్నారు. అయితే ఆ సమావేశాలకు జిన్‌పింగ్ వస్తారని తొలుత ప్రచారం జరిగింది. కానీ ఆయన తన ప్లాన్ మార్చుకున్నట్లు కొన్ని మీడియా కథనాలు ద్వారా తెలుస్తోంది. జిన్‌పింగ్ స్థానంలో ఆ దేశ ప్రధాని లీ కియాంగ్ తమ ప్రతినిధుల బృందంతో హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
ప్రస్తుతం భారత్, చైనా మధ్య ఉద్రిక్తత వాతావరణం ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల చైనా రిలీజ్ చేసిన కొత్త మ్యాప్ పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్ ప్రదేశాలను తమ భూభాగంలో ఉన్నట్లు చైనా తన మ్యాప్‌లో ప్రచురించింది. దీన్ని భారత్ ఖండిస్తూ తన నిరసనను వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య మళ్లీ ప్రచ్ఛన్న వాతావరణం నెలకొన్నది. అందుకే జిన్‌పింగ్ జీ20 సమావేశాల కోసం ఇండియా రావడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
జిన్‌పింగ్ రాకపోవడం నిరాశకు గురి చేస్తుందని బైడెన్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయినా తాను జిన్‌పింగ్‌ను కలుసుకోనున్నట్లు చెప్పారు. గత ఏడాది ఇండోనేషియాలో ఇద్దరూ భేటీ అయ్యారు. మళ్లీ ఆ నేతలిద్దరూ నవంబర్‌లో జరిగే అపెక్ సమావేశాల్లో పాల్గొనే ఛాన్సు ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

