Viral News | లాటరీ కోట్లు గెలుచుకున్న భర్త.. ఆ డబ్బు నాకే అని కోర్టులో కేసు వేసిన భార్య
Viral News | లాటరీలో కోట్ల రూపాయలు గెలుచుకున్న ఓ భర్తకు భార్య దిమ్మతిరిగే షాకిచ్చింది. జాక్‌పాట్ తగిలిన విషయాన్ని తనకు చెప్పకుండా ఆ డబ్బుతో సీక్రెట్‌గా ఎంజాయ్ చేస్తున్నాడని అసూయతో రగిలిపోయింది.
Viral News | లాటరీలో కోట్ల రూపాయలు గెలుచుకున్న ఓ భర్తకు భార్య దిమ్మతిరిగే షాకిచ్చింది. జాక్‌పాట్ తగిలిన విషయాన్ని తనకు చెప్పకుండా ఆ డబ్బుతో సీక్రెట్‌గా ఎంజాయ్ చేస్తున్నాడని అసూయతో రగిలిపోయింది. ఆ జాక్‌పాట్ డబ్బులో తనకు వాటా కావాల్సిందేనని భర్తపైనే కేసు వేసింది. లాటరీ డబ్బులే కాకుండా ఆస్తిలో కూడా సగం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసింది. ఆశ్చర్యకరంగా కోర్టు కూడా భార్యకే అనుకూలంగా తీర్పు ఇచ్చింది. చైనాలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది.
చైనాకు చెందిన జోవ్ అనే వ్యక్తికి లాటరీలో జాక్‌పాట్ తగిలింది. రూ.12 కోట్ల లాటరీ గెలుచుకుంటే ట్యాక్స్‌లు అన్నీ పోనూ రూ.10.22 కోట్లు వచ్చాయి. ఒక్కసారిగా కోట్ల రూపాయలు రావడంతో తన సొంతానికి ఖర్చు చేసుకోవాలని అనుకున్నాడు. భార్య లిస్కు చెబితే తన చిన్న చిన్న ఆశలు తీర్చుకోలేనని భావించాడు. ఇంకేముందీ సీక్రెట్‌గా ఆ డబ్బును ఖర్చు చేయడం మొదలుపెట్టాడు. కొంత డబ్బును తన సోదరికి ఇచ్చాడు. 85 లక్షలతో ఖరీదైన ఫ్లాట్‌ను కొని తన మాజీ గర్ల్‌ఫ్రెండ్‌కు గిఫ్ట్ ఇచ్చాడు. కానీ ఈ విషయం ఎన్నో రోజులు దాగలేదు. భర్త బండారం తొందరగానే భార్య ముందు బట్టబయలు అయ్యింది.
కోట్ల లాటరీ తగిలిందన్న విషయం సీక్రెట్‌గా దాచినందుకు లిస్ ఆగ్రహంతో రగిలిపోయింది. దానికంటే కూడా ఆ డబ్బును తనకు తెలియకుండా తన భర్త సోదరి, మాజీ ప్రేయసికి ఖర్చు పెట్టడం ఆమెలో మరింత అసూయను పెంచేసింది. ఎలాగైనా ఆ డబ్బు మొత్తం కావాల్సిందేనని పట్టుబట్టింది. తన భర్తకు తగిలిన లాటరీలో తనకు కూడా వాటా ఉంటుందని.. తన భాగాన్ని ఇప్పించాలని లిస్ కోర్టును ఆశ్రయించింది. లాటరీ డబ్బుతో పాటు భర్త పేరు మీద ఉన్న మొత్తం ఆస్తిని రెండు భాగాలుగా పంచాలని కోరింది.
లాటరీ తగిలిన విషయాన్ని జోవ్ సీక్రెట్‌గా ఉంచడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. సోదరి, మాజీ ప్రేయసికి ఇచ్చిన డబ్బు కూడా లాటరీలో గెలుచుకున్నదే అని గుర్తించింది. దీంతో జోవ్పై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. లాటరీలో గెలుచుకున్న మొత్తం డబ్బులో 60 శాతం భార్య లిస్కే చెందుతుందని తీర్పును ఇచ్చింది. మిగతా ఆస్తిలో సగ భాగం లిస్కు ఇవ్వాలని ఆదేశించింది. భార్యను చీట్ చేద్దామని చూసి నష్టపోయిన భర్త గురించి వస్తున్న ఈ కథనాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
ఇలా భార్యకు తెలియకుండా లాటరీ డబ్బును దాచిన ఘటనలు జరగడం ఇదే తొలిసారి ఏమీ కాదు.. గతంలో చైనాలోనే ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. రూ.248 కోట్లు గెలుచుకున్న ఓ వ్యక్తి ఆ విషయాన్ని తన కుటుంబ సభ్యులు ఎవరికీ తెలియకుండా దాచాడు. తీరా అందరికీ తెలిసిన తర్వాత నిలదీస్తే ఆశ్చర్యకరమైన విషయం చెప్పాడు. ఇంత డబ్బు వచ్చిందని తెలిస్తే కుటుంబసభ్యులంతా సోమరిపోతుల్లా అయిపోతారని భావించి అలా చెప్పకుండా దాచానని బయటపెట్టాడు.
Read More :
పులి బారి నుంచి తప్పించుకున్న చిరుత..క్లైమాక్స్‌లో ట్విస్ట్
Underwater Kiss | ప్రేమికుల రోజున లాంగ్ కిస్.. గిన్నిస్ రికార్డుల్లో జంట.. వీడియో వైరల్
Viral video | నీళ్ల డబ్బాలు దించడంలో తల్లికి సాయపడుతున్న బుడతడు.. చూస్తే నవ్వకుండా ఉండలేరు..!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

