China Power Cuts | చైనాకు కరెంట్ కష్టాలు.. ఎందుకీ పరిస్థితి?
ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనాలో మరో సంక్షోభం ముదురుతోంది. ఆ దేశాన్ని ప్రస్తుతం కరెంట్ కష్టాలు( China Power Cuts ) వేధిస్తున్నాయి.

బీజింగ్: ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనాలో మరో సంక్షోభం ముదురుతోంది. ఆ దేశాన్ని ప్రస్తుతం కరెంట్ కష్టాలు( China Power Cuts ) వేధిస్తున్నాయి. 60 శాతం ఆర్థిక వ్యవస్థ ఆధారపడే బొగ్గుకు తీవ్ర కొరత ఏర్పడటంతో అది కరెంటు ఉత్పత్తిపై ప్రభావం చూపింది. అది కాస్తా వివిధ రంగాలను కుదేలు చేస్తూ.. డ్రాగన్ వృద్ధి రేటును దెబ్బ తీస్తోంది. రికార్డు స్థాయిలో బొగ్గు ధరలు, కరెంటు ధరలపై ప్రభుత్వ నియంత్రణలు, కఠినమైన కర్బన ఉద్గారాల లక్ష్యాలు.. ఇలా అన్నీ కలిపి దేశంలోని 12కుపైగా ప్రావిన్స్‌లు, ప్రాంతాల్లో అంధకారం నెలకొనేలా చేసింది.
తయారీ రంగం కుదేలు
ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేయడానికి ఎలక్ట్రానిక్స్ నుంచి జీన్స్ వరకూ.. ఓ తయారీ హబ్‌గా వెలుగొందే చైనాలోని గువాంగ్డాంగ్లోనూ ఇప్పుడు పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కరెంటు కోతలు లేదంటే కొన్ని వారాలుగా తయారీపై విధించిన ఆంక్షలతో సప్లై చెయిన్ పూర్తిగా దెబ్బతిన్నది. చాలా వరకూ మెషీన్లను పక్కన పెట్టేస్తున్నారు. పని గంటలను తగ్గిస్తున్నారు. స్థానిక గ్రిడ్లపై ఒత్తిడి తగ్గించేందుకే ఫ్యాక్టరీలు తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వస్తోంది.
అయితే ఇప్పటికే తీసుకున్న ఆర్డర్లను సప్లై చేయాల్సి ఉండటంతో లక్ష్యాలను చేరుకోవడానికి నైట్ షిఫ్ట్‌లు చేయించడం, సొంత జనరేటర్లను ఉపయోగించడం చేస్తున్నట్లు టీవీలు తయారుచేసే ఎక్స్‌ప్రెస్ లక్ సంస్థ జనరల్ మేనేజర్ షెర్మాన్ చాన్ చెబుతున్నారు. కరెంటు సంక్షోభం ముదురుతుండటంతో అన్ని కంపెనీలూ ఉత్పత్తిలో ఆలస్యం తప్పదని చెబుతున్నాయి.
అసాధారణ పరిస్థితి
ఒక విధంగా కరెంటు విషయంలో చైనా ప్రస్తుతం అసాధారణ పరిస్థితులను ఎదుర్కొంటోంది. కనీసం ఇళ్లకైనా ఎలాంటి ఆటంకాలు లేకుండా కరెంటు సరఫరా చేయాలని మంగళవారం ప్రత్యేకంగా సమావేశమైన జాతీయ గ్రిడ్ అధికారులు నిర్ణయించారు. కరెంటు వాడకంలో కరోనా మహమ్మారి మునుపటి పరిస్థితులు వచ్చిన వేళ చైనా ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అదే సమయంలో ఆస్ట్రేలియాతో నెలకొన్ని రాజకీయ విభేదాల నేపథ్యంలో ఆ దేశం నుంచి బొగ్గు దిగుమతులపై ఆంక్షలు కొనసాగుతున్నాయి.
ఇది విద్యుత్ ఉత్పత్తిపై మరింత ప్రభావం చూపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత, చైనాలో విద్యుత్తుపై ధరల ఆంక్షలే ఈ సమస్యకు ప్రధాన కారణమని క్యాపిటల్ ఎకనమిక్స్ అనలిస్ట్ జూలియన్ ఎవాన్స్ ప్రిచార్డ్ అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అసాధారణ వాతావరణ పరిస్థితుల కారణంగా బొగ్గు, సహజ వాయువు ధరలు భారీగా పెరిగిపోయినట్లు ఆయన చెప్పారు.
ఇక వినియోగదారులపై మరీ ఎక్కువగా కరెంటు భారం మోపకూడదన్న ఆంక్షలు, పెరిగిపోయిన బొగ్గు ధరలు పవర్ ప్లాంట్లను కుదేలు చేస్తున్నాయి. విద్యుత్ సంక్షోభం కారణంగా చైనా ఆర్థిక వృద్ధి కూడా మందగిస్తోంది. ఇప్పటికే గోల్డ్‌మాన్ సచ్స్, నోమురా సంస్థలు చైనా వార్షిక వృద్ధి అంచనాలను తగ్గించాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
Ala venkateshwar reddy | పెద్దవాగు వెంట రైతులతో ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాదయాత్ర.. వివరాలివే
minister bhoomipuja for traffic signal | ట్రాఫిక్ సిగ్నల్ కోసం భూమిపూజ చేసిన బీజేపీ మంత్రి.. సోషల్ మీడియాలో గొప్పగా ప్రచారం
Human Egg | మానవ అండాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు.. ఈడీ దాడుల్లో భారీగా నగదు, ఆస్తులు సీజ్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

