3 నుంచి 17 ఏళ్ల పిల్లలకు కోవిడ్ టీకా.. చైనా అత్యవసర అనుమతి

బీజింగ్: చిన్న పిల్లలకు కోవిడ్ టీకాలు ఇచ్చేందుకు చైనా అనుమతి ఇచ్చింది. మూడేళ్ల నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్నవారికి సైనోవాక్ టీకా వేసేందుకు అత్యవసర అనుమతి దక్కినట్లు ఆ సంస్థ చైర్మన్ యిన్ వీడాంగ్ తెలిపారు. చైనాలో వ్యాక్సినేషన్ డ్రైవ్ జోరుగా సాగుతున్నది. ఇప్పటి వరకు ఆ దేశంలో 72.35 కోట్ల మందికి కోవిడ్ టీకాలు ఇచ్చేశారు. అయితే కేవలం 18 ఏళ్లు దాటిన వారికి మాత్రమే అక్కడ కోవిడ్ టీకాలు వేస్తున్నారు. రెండు వ్యాక్సిన్లకు ఆ దేశం ఆమోదం తెలిపింది. చిన్ని పిల్లలకు సంబంధించిన టీకా డ్రైవ్ షెడ్యూల్ను ప్రభుత్వం త్వరలో రిలీజ్ చేస్తుందని, ఆ తర్వాత టీకాలు ఇవ్వడం ప్రారంభిస్తామని యిన్ వీడాంగ్ తెలిపారు.
కరోనా వైరస్ విషయంలో మైనర్లకు ఎక్కువ ప్రియార్టీ ఇవ్వడం లేదని, ఎందుకంటే మధ్య వయసు దాటిన వారిలో మాత్రమే ఇన్ఫెక్షన్ లక్షణాలు అధిక శాతం ఉంటున్నాయని వీడాంగ్ తెలిపారు. తొలి, రెండవ దశ ట్రయల్స్ నిర్వహించామని, మూడు నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న వారిలో టీకా వల్ల ఇమ్యూన్ వ్యవస్థ బలపడినట్లు గుర్తించామన్నారు. అయితే అతి స్వల్ప స్థాయిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నారు. పిల్లలపై జరిపిన టీకా ప్రయోగాలకు సంబంధించి సైనోఫార్మ్ కంపెనీ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు డేటా సమర్పిస్తున్నది. మరో సంస్థ క్యాన్సినో బయోలాజిక్స్ కూడా పిల్లలపై టీకా ట్రయల్స్ నిర్వహిస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

