ChatGPT | న్యూయార్క్: చాట్‌జీపీటీకి క్రమంగా ఆదరణ తగ్గుతున్నది. వరుసగా మూడో నెల చాట్‌జీపీటీ వీక్షణలో క్షీణత కనిపించింది. ఈ మేరకు సిమిలర్ వెబ్ సంస్థ వెల్లడించింది. క్రితం నెలతో పోలిస్తే ఆగస్టులో 3.2 శాతం క్షీణత నమోదైంది. డెస్క్‌టాప్‌తో పాటు మొబైల్ యూజర్లు సైతం చాట్‌జీపీటీకి దూరమవుతున్నారు. మూడు నెలల్లో 10 శాతం వరకు వీక్షణల్లో క్షీణత కనిపించింది. కాగా, ఈ సైట్లో సగటు వీక్షణ సమయం మార్చిలో 8.7 నిమిషాలు ఉండగా.. ఆగస్టు నాటికి అది 7 నిమిషాలకు పడిపోయింది.