Cash App: క్యాష్ యాప్ వ్యవస్థాపకుడి హత్య
Cash App: క్యాష్ యాప్ ఫౌండర్‌ను హత్య చేశారు. కత్తితో పొడిచి చంపారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో ఈ మర్డర్ జరిగింది.
శాన్ ఫ్రాన్సిస్కో: యాప్ యాప్(Cash App) టెక్ కంపెనీ వ్యవస్థాపకుడు బాబ్ లీ(Bob Lee)ని హత్య చేశారు. కత్తితో పొడిచి చంపారు. శాన్ఫ్రాన్సిస్కో నగరంలో ఈ ఘటన జరిగింది. ఆయన కుటుంబసభ్యులు ఈ విషయాన్ని తెలిపారు. 43 ఏళ్ల బాబ్ శరీరంపై కత్తి పోట్లు ఉన్నాయని, చికిత్స కోసం ఆయన్ను హాస్పిటల్‌కు తరలించే లోపు ప్రాణాలు పోయినట్లు పోలీసులు తెలిపారు.
ఇటీవల శాన్ ఫ్రాన్సిస్కోలో వరుస హత్యా ఘటనలు జరుగుతున్నాయి. దీంతో స్థానిక అధికారులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అమెరికాలోనే ఇప్పుడు ఆ నగరం మోస్ట్ డేంజరస్ సిటీగా మారినట్లు క్రైమ్ డేటా చెబుతోంది.
క్యాష్ యాప్ అమెరికాలో చాలా ఫేమస్. మొబైల్ పేమెంట్ సర్వీస్‌గా దీన్ని వాడుతారు. ఈ యాప్ ద్వారా మరో యూజర్‌కు ఫోన్ ద్వారా మనీ ట్రాన్స్పర్ చేస్తారు. 2021లో సుమారు 7 కోట్ల మంది ఆ యాప్‌ను వాడారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. 400 కొట్టిన చిన్మయ సుతార్
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

