Canada PM Justin Trudeau | కెనడా ప్రధానిగా ట్రూడో రాజీనామా..!
Canada PM Justin Trudeau | కెనడా రాజకీయాల్లో కుదుపు చోటు చేసుకుంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సోమవారం తన పదవికి రాజీనామా చేశారు.
Canada PM Justin Trudeau | కెనడా రాజకీయాల్లో కుదుపు చోటు చేసుకుంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. తన నాయకత్వంపై లిబరల్ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అసంతృప్తి పెరిగిపోతుండటంతో అర్ధంతరంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ట్రూడో క్యాబినెట్ నుంచి ఆర్థిక మంత్రి వైదొలగడంతో ఆయన ప్రభుత్వంలో సంక్షోభం పతకా స్థాయికి చేరుకుంది. లిబరల్ పార్టీ కొత్త నాయకుడ్ని ఎన్నుకునే వరకూ ప్రధానిగా కొనసాగుతానని ట్రూడో స్పష్టం చేశారు.
అంతర్గత సమస్యల వల్ల తదుపరి ఎన్నికలు జరిగే వరకూ నాయకుడిగా కొనసాగలేనని జస్టిన్ ట్రూడో చెప్పారు. పోరాటంలో వెనక్కు తగ్గడం అంత తేలికేం కాదన్నారు. ప్రత్యేకించి కెనడా పౌరులు, పార్టీ, దేశానికి చాలా ముఖ్యం అన్నారు. ప్రజాస్వామ్యంలో కెనడియన్ల ప్రయోజనాల పరిరక్షణకు తాను ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని చెప్పారు.
ప్రధానిగా జస్టిన్ ట్రూడో రాజీనామాతో ఈ నెల 27న ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలు మార్చి 24 వరకూ వాయిదా పడ్డాయి. ఈ మూడు నెలల కాలంలో తదుపరి లిబరల్ పార్టీ నాయకుడ్ని ఎన్నుకోవడానికి సమయం సరిపోతుందని భావిస్తున్నారు. దేశంలోని మూడు ప్రధాన ప్రతిపక్షాలు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడానికి సిద్ధం కావడంతో ట్రూడో రాజీనామాకు ప్రాధాన్యం ఏర్పడింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishwak Sen | ఎన్టీఆర్‌తో సినిమానా… కథ తీసుకెళ్తే కొడతాడంటూ విశ్వక్ సేన్ కామెంట్స్
Para Swimmer Aalam Shaikh: హోటల్లో మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన.. భారత పారా స్విమ్మర్ డిపోర్ట్
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

