Justin Trudeau | టొరంటో, డిసెంబర్ 14: ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ పాత్ర ఉందంటూ చేసిన ఆరోపణలపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి స్పందించారు. ఏజెన్సీ కెనడియన్ ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారత్ అలాంటి చర్యలను కెనడాలో పునరావృతం చేయొద్దనే తాను ఆ విషయాన్ని బహిర్గతం చేసినట్టు చెప్పారు.
నిజ్జర్ హత్యపై ఆధారాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. నిజ్జర్ హత్యలో భారత్ ఏజెంట్ల పాత్ర ఉందంటూ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే.