Justin Trudeau | 9 ఏండ్ల పాలనకు మరో 90 రోజుల్లో తెర.. ప్రధాని, పార్టీ అధినేత పదవుల నుంచి తప్పుకుంటా: జస్టిన్ ట్రూడో
కెనడా ప్రధానమంత్రి పదవికి, అధికార లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా అధినేత పదవికి రాజీనామా చేస్తున్నట్టు జస్టిన్ ట్రూడో ప్రకటించారు. సోమవారం ఒట్టావాలోని తన నివాసం వద్ద ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తాను రాజీనామా చేస్తానని తన పార్టీకి, గవర్నర్‌కు తెలియజేసినట్టు తెలిపారు. కొత్త ప్రధాని ఎన్నిక వరకు తాను ఈ పదవుల్లో కొనసాగుతానని చెప్పారు.
- రాజీనామా చేస్తున్నా
- కెనడా ప్రధాని ట్రూడో ప్రకటన
- పార్టీలో, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతతో నిర్ణయం
Justin Trudeau | ఒట్టావా, జనవరి 6: కెనడా ప్రధానమంత్రి పదవికి, అధికార లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా అధినేత పదవికి రాజీనామా చేస్తున్నట్టు జస్టిన్ ట్రూడో ప్రకటించారు. సోమవారం ఒట్టావాలోని తన నివాసం వద్ద ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తాను రాజీనామా చేస్తానని తన పార్టీకి, గవర్నర్‌కు తెలియజేసినట్టు తెలిపారు. కొత్త ప్రధాని ఎన్నిక వరకు తాను ఈ పదవుల్లో కొనసాగుతానని చెప్పారు. ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల వరకు పార్టీని, కెనడాకు నాయకత్వం వహించే కొత్త నేత ఎన్నిక ప్రక్రియను ప్రారంభించేందుకు వీలుగా జనవరి 27న ప్రారంభం కావాల్సిన పార్లమెంటును మార్చి 24 వరకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
‘నేను ఏ పోరాటం నుంచి అంత సులువుగా వెనక్కు తగ్గను. కానీ, కెనడియన్ల ప్రయోజనాలు, నేను ప్రేమించే ప్రజాస్వామ్య శ్రేయస్సు కోసం రాజీనామా చేస్తున్నాను’ అని ట్రూడో వ్యాఖ్యానించారు. కెనడాలో అధికార పార్టీ అధినేత రాజీనామా తర్వాత కొత్త నాయకుడి ఎన్నికకు 90 రోజుల గడువు ఉంటుంది. ఈ నేపథ్యంలో తొమ్మిదేండ్ల జస్టిన్ ట్రూడో పాలనకు మరో 90 రోజుల్లోపే తెరపడనుంది.
ఇంటా బయటా వ్యతిరేకతతోనే..
సొంత పార్టీలో, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతతోనే జస్టిన్ ట్రూడో తన పదవిని వదులుకోవాల్సి వస్తున్నది. ఇటీవల వెలువడిన ఒపీనియన్ పోల్స్‌లో ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీకి ప్రజల మద్దతు భారీగా పెరిగిందని తేలింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు తన పదవిని వదులుకోక తప్పని పరిస్థితి ట్రూడోకు ఏర్పడింది. ట్రూడో కొన్ని రోజులుగా రాజకీయంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు.
అధికార పార్టీకి కీలక భాగస్వామిగా ఉన్న న్యూ డెమాక్రటిక్ పార్టీ మద్దతు సెప్టెంబర్‌లో ఉపసంహరించుకుంది. దీంతో చిన్న పార్టీల మద్దతుతో అతి కష్టం మీద అవిశ్వాస తీర్మానంలో ట్రూడో నెగ్గారు. ట్రూడో విధానరపరమై విభేదాలతో డిసెంబర్లో కెనడా ఆర్థిక మంత్రి రాజీనామా ట్రూడోకు మరో దెబ్బ. దేశంలో వృద్ధి కుంటుపడటం, ద్రవ్యోల్బణం పెరగడంతో ఆర్థిక సంక్షోభం కూడా ట్రూడోకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో సొంత పార్టీలోనే ఆయన తప్పుకోవాలనే డిమాండ్లు మొదలయ్యాయి. ఇలా వరుస ఎదురుదెబ్బల నేపథ్యంలో ఎట్టకేలకు ట్రూడో తన బాధ్యతల నుంచి వైదొలగనున్నట్టు ప్రకటించారు.
నైట్‌క్లబ్ బౌన్సర్ నుంచి ప్రధానిగా..
జస్టిన్ ట్రూడో కెనడాకు 23వ ప్రధాని. ఆయన తండ్రి పియెర్రె ట్రూడో సైతం కెనడాకు 16 ఏండ్లు ప్రధానిగా పని చేశారు. 2015లో జస్టిన్ కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. రాజకీయాల్లోకి రాకముందు ట్రూడో సాదాసీదా జీవితం గడిపారు. టీచర్‌గా, నైట్‌క్లబ్‌లో బౌన్సర్‌గా, స్నోబోర్డు శిక్షకుడిగానూ పని చేశారు.
ఖలిస్థానీ శక్తుల అనుకూలుడిగా ముద్ర
కెనడాలోని ఖలిస్థానీల పట్ల ఉదాసీన వైఖరిని అవలంబించి వేర్పాటువాద శక్తులకు అనుకూలుడిగా జస్టిన్ ట్రూడో ముద్రపడ్డారు. తన పదవీకాలం చివర్లో ఆయన భారత్‌తో కయ్యానికి దిగారు. ఖలిస్థానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత దౌత్యవేత్తలు, నాయకుల ప్రభావం ఉందని ట్రూడో, ఆయన యంత్రాంగం ఆరోపించడం రెండు దేశాల మధ్య దౌత్యపరమైన సంక్షోభాన్ని తీసుకొచ్చింది. భారతీయుల పట్ల ఇమ్మిగ్రేషన్ విధానాలనూ ఆయన కఠినంగా మార్చే ప్రయత్నం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

