Justin Trudeau | ఖలిస్థానీ ఉగ్రవాది హత్యలో భారత్ పాత్ర.. ఆరోపించిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో
ఇటీవల తమ దేశంలో జరిగిన ఖలిస్తానీ (Khalistan) ఉగ్రవాది హత్యలో భారత్ పాత్ర ఉందంటూ కెనడా (Canada) ప్రధాని జస్టిన్ ట్రుడో (PM Justin Trudeau) ఆరోపించారు. ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను (Hardeep Singh Nijjar) చంపిన కేసులో భారతీయ ఏజెంట్లకు సంబంధం ఉందని తమ ప్రభుత్వం వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని చెప్పారు.
ఒట్టావా: ఇటీవల తమ దేశంలో జరిగిన ఖలిస్తానీ (Khalistan) ఉగ్రవాది హత్యలో భారత్ పాత్ర ఉందంటూ కెనడా (Canada) ప్రధాని జస్టిన్ ట్రుడో (PM Justin Trudeau) ఆరోపించారు. ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను (Hardeep Singh Nijjar) చంపిన కేసులో భారతీయ ఏజెంట్లకు (Indian Agents) సంబంధం ఉందని తమ ప్రభుత్వం వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని చెప్పారు. ఈ విషయమై దేశీయ భద్రతా సంస్థలు సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నాయని మంగళవారం వెల్లడించారు. కెనడా పౌరుడి హత్యలో ఏదైనా విదేశీ ప్రభుత్వ ప్రమేయం తమ సార్వభౌమాధికారానికి ఆమోదయోగ్యం కాని ఉల్లంఘన అంటూ ప్రకటించారు. ఈ విషయమై సహకరించాల్సిందిగా భారత ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. గతవారం జరిగిన జీ20 సమావేశాల సందర్భంగా ఈ విషయాన్ని భారత ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లినట్లు ట్రుడో తెలిపారు. ఈ ఏడాది జూన్ 18న వాంకోవర్‌లోని సర్రే గురుద్వారా వద్ద భారత్ వాంటెడ్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురైన విషయం తెలిసిందే.
ఖలిస్థానీ టైగర్ ఫోర్స్ (KTF)కు చెందిన నిజ్జర్.. జలంధర్‌లో (Jalandhar) హిందూ పూజారిని చంపిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ప్రకటించింది. అతడిని పట్టించినవారికి రూ.10 లక్షల రివార్డును కూడా ప్రకటించింది. కాగా, భారత గూఢచార సంస్థ రా అధికారిని బహిస్తున్నట్లు కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ప్రకటించారు. అయితే ఆ అధికారి ఎవరనే విషయాన్ని ఆమె వెల్లడించలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

