జూమ్‌లో పార్లమెంట్ సమావేశాలు.. నగ్నంగా కనిపించిన ఎంపీ

టోరంటో: కెనడా పార్లమెంట్‌కు చెందిన ఓ ఎంపీ .. జూమ్ కాల్లో నగ్నంగా కనిపించాడు. ఈ ఘటనతో తోటి పార్లమెంట్ సభ్యులు ఉలిక్కిపడ్డారు. అయితే జూమ్ వీడియో కాల్లో నగ్నంగా కనిపించిన ఘటన పట్ల ఎంపీ విలియమ్ ఆమోస్ క్షమాపణలు చెప్పారు. పొరపాటున ఇలా జరిగిందని ఆయన ఆ తర్వాత తన ట్విట్టర్లో సారీ చెప్పారు. విలియమ్ ఆమోస్‌ది క్యూబెక్ జిల్లాలోని పాంటియాక్ నియోజకవర్గం. జాగింగ్‌కు వెళ్లి వచ్చిన తర్వాత దుస్తులు మార్చుకుంటున్న సమయంలో జూమ్ వీడియో అకస్మాత్తుగా ఆన్ అయ్యిందని, దాంతో తాను నగ్నంగా కనిపించాల్సి వచ్చిందన్నారు. ఎంపీ ఆమోస్ నగ్నంగా ఉన్న ఓ స్క్రీన్ షాట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. లిబరల్ పార్టీకి చెందిన ఆ ఎంపీ ఆ ఘటన తనను ఇబ్బందికి గురి చేసిందన్నారు. నిజాయితీగా తప్పును ఒప్పుకుంటున్నానని, ఇంకోసారి ఇలా జరగనివ్వనన్నారు. హౌజ్ ఆఫ్ కామన్స్ సభ్యులకు ఆయన క్షమాపణలు చెప్పారు. నిజానికి కెనడా పార్లమెంట్ సభ్యులు ఎటువంటి సమావేశాల్లో పాల్గొన్నా వాళ్లు కచ్చితంగా టై, జాకెట్ ధరించాల్సి ఉంటుంది. అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో ఈ ఘటన పట్ల ఇంకా ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
‘బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి’
‘కుష్టు లక్షణాలను దాచిపెడితే ముప్పు’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

