Cigarette | ఒట్టావా: పొగరాయుళ్లకు అరోగ్యం విషయంలో అవగాహన కల్పించే దిశగా కెనడా కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇకపై కేవలం సిగరెట్ ప్యాకెట్‌పైనే కాకుండా.. అమ్మకం జరిపే ప్రతీ సిగరెట్‌పై వార్నింగ్ లేబుల్ ముద్రణ ఉండాలంటూ తాజాగా ఆదేశాలు జారీచేసింది.
సిగరెట్‌పై ‘సిగరెట్స్ కాజెస్ ఇంపోటెన్స్ అండ్ క్యాన్సర్ (సిగరెట్ల వలన నంపుసకత్వం, క్యాన్సర్ వస్తుంది)’ పాయిజన్ ఇన్ ఎవిరీ పఫ్(పీల్చే ప్రతి దమ్ములో విషం ఉంటుంది)’ అనే హెచ్చరికలు ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కొత్త నిబంధనలు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. ఈ తరహా కొత్త నిబంధనలను కెనడా ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ ఏడాది మేలో ప్రకటించింది.