Beijing Olympics | అమెరికా, ఆస్ట్రేలియా బాటలోనే కెనడా..
Beijing Olympics | అమెరికా, ఆస్ట్రేలియాబాటలోనే కెనడా పయనించింది. బీజింగ్ ఒలింపిక్స్‌ను బహిష్కరించాలని కెనడా ప్రభుత్వం నిర్ణయించింది.

ఒట్టావా: అమెరికా, ఆస్ట్రేలియాబాటలోనే కెనడా పయనించింది. బీజింగ్ ఒలింపిక్స్‌ను బహిష్కరించాలని కెనడా ప్రభుత్వం నిర్ణయించింది. మానవ హక్కుల ఉల్లంఘన, చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని జస్టిన్ ట్రుడో ప్రకటించారు. వచ్చేడాది బీజింగ్‌లో జరిగిన వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ, ముగింపు వేడుకల్లో తమ దేశం తరఫున అధికారులు గానీ, రాయబారులు గానీ పాల్గొనరని చెప్పారు. అయితే క్రీడాకారులు క్రీడల్లో పాల్గొంటారని వెల్లడించారు. ఈ విషయాన్ని గత నాలుగు నెలలుగా పరిశీలిస్తున్నామని, తమ భాగస్వామ్య దేశాలతో చర్చించిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని ట్రుడో తెలిపారు.

బీజింగ్‌లో జరిగే వింటర్ ఒలింపిక్స్‌ను బహిష్కరిస్తున్నామని అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, లిథువేనియాలు ఇప్పటికే ప్రకటించాయి. తాజాగా ఈ జాబితాలో కెనడా చేరడంతో ఈ సంఖ్య ఐదుకు చేరింది. ఇదే విషయమై ఫ్రాన్స్ కూడా త్వరలో నిర్ణయం తీసుకోనుంది. యూరోపియన్ దేశాలతో చర్చిస్తున్నామని ఫ్రాన్స్ విదేశాంగ శాఖ కార్యదర్శి తెలిపారు.
Canada remains deeply disturbed by reports of human rights violations in China. As a result, we won’t be sending diplomatic representatives to Beijing for the Olympic and Paralympic Winter Games. We’ll continue to support our athletes who work hard to compete on the world stage.
— Justin Trudeau (@JustinTrudeau) December 8, 2021
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

