కెనడాలో 15కు చేరిన ఒమిక్రాన్ కేసులు
Omicron | కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) ప్రపంచంలో కలకలం రేపుతున్నది. దక్షిణాఫ్రికాలో కనుగొన్న ఈ కొత్త వేరియంట్ క్రమంగా అన్ని దేశాలకు విస్తరిస్తున్నది.

ఒట్టావా: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) ప్రపంచంలో కలకలం రేపుతున్నది. దక్షిణాఫ్రికాలో కొత్తరూపు సంతరించుకున్న కరోనా మహమ్మారి క్రమంగా అన్ని దేశాలకు విస్తరిస్తున్నది. కెనడాలో ఈ తరహా కేసులు 15కు చేరాయి. దేశంలో తొలికేసు గతనెల 28న నమోదయింది. ఆఫ్రికా దేశమైన నైజీరియా నుంచి ఒంటారియకు వచ్చిన ఇద్దరికి ఈ వైరస్ సోకింది.
దేశంలో ఒమిక్రాన్ కేసులు 15కు పెరిగాయని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఈనేపథ్యంలో దేశంలో వ్యాక్సినేషన్ పూర్తిచేసుకున్న 50 ఏండ్లు పైబడినవారికి బూస్టర్ డోస్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు నేషనల్ అడ్వైజరీ బోర్డు సూచించిందని వెల్లడించారు. కాగా, వారిలో 12 ఏండ్ల చిన్నారి కూడా ఉందని, ఆమె ఈ మధ్యే దక్షిణాఫ్రికా నుంచి వచ్చిందని చీఫ్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ థెరిసా టామ్ తెలిపారు.
టొరంటోలో మూడు ఒమిక్రాన్ కేసు నమోదయిందని ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. అందులో ఇద్దరు నైజీరియా నుంచి, మరొకరు స్విట్జర్లాండ్ నుంచి వచ్చారని వెల్లడించారు. కాగా, ఆఫ్రికాతోసహా అన్ని దేశాల అంతర్జాతీయ విమాన సర్వీసులపై కెనడా నిషేధం విధించిన విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishwak Sen | ఎన్టీఆర్‌తో సినిమానా… కథ తీసుకెళ్తే కొడతాడంటూ విశ్వక్ సేన్ కామెంట్స్
Para Swimmer Aalam Shaikh: హోటల్లో మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన.. భారత పారా స్విమ్మర్ డిపోర్ట్
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

