California : దక్షిణ కాలిఫోర్నియాలో దట్టమైన పొగమంచు భారీ ప్రమాదానికి దారితీసింది. పొగమంచు గట్టిగా కమ్ముకుని కనీసం 10 మీటర్ల దూరం కనిపించకపోవడంతో వాహదారులు పెద్ద సంఖ్యలో ప్రమాదాల బారినపడ్డారు. పొగమంచు కారణంగా అంతర్రాష్ట్ర రహదారి-5 పైన ఏకంగా 35 వాహనాలు ఒకదానితో ఒకటి ఢీ కొన్నాయి.
ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. తొమ్మిది మంది గాయపడ్డారు. బేకర్స్ ఫీల్డ్‌కు పశ్చిమ దిశలో స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 7.30 గంటలకు ప్రమాదం చోటుచేసుకుంది. మొత్తం 17 ప్రయాణికుల వాహనాలు, 18 భారీ సరుకు రవాణా వాహనాలు ఈ ప్రమాదానికి గురయ్యాయి.