వాషింగ్టన్: కులం, కుల వివక్ష హిందుత్వంలో ముఖ్యమైన భాగం కాదని కాలిఫోర్నియా సివిల్ రైట్స్ డిపార్ట్మెంట్ (సీఆర్డీ) తెలిపింది. హిందూ అమెరికన్ ఫౌండేషన్ (హెచ్ఏఎఫ్) ప్రకటన ప్రకారం, సిలికాన్ వ్యాలీలోని ఒక కంపెనీలో కుల వివక్ష జరిగినట్లు సీఆర్డీ 2020లో ఫిర్యాదు చేసింది.
హిందుత్వంలో కులం, కుల వివక్ష ముఖ్యమైన భాగాలు కాదని తెలిపింది. హిందూ మత బోధనలు, ఆచారాలలో అవి ముఖ్యమైన భాగమనే తప్పుడు, వ్యాఖ్యలను తొలగించడం హిందువుల విజయమని హెచ్ఏఎఫ్ తెలిపింది