Cairo Accident | కైరోలో ఢీకొట్టుకున్న వాహనాలు.. 32 మంది దుర్మరణం..!
Cairo Accident | ఈజిప్ట్ రాజధాని కైరోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధ్యధరా నగరమైన అలెగ్జాండ్రియాను కలిపే హైవేపై శనివారం కార్లు, పలు వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకున్నాయి.
Cairo Accident | ఈజిప్ట్ రాజధాని కైరోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధ్యధరా నగరమైన అలెగ్జాండ్రియాను కలిపే హైవేపై శనివారం కార్లు, పలు వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకున్నాయి. ఘటనలో 32 మంది దుర్మరణం చెందగా.. 63 మంది వరకు గాయపడ్డారు. హైవేపై మూడు ప్యాసింజర్ బస్సులు, పది కార్లు ఢీకొట్టుకున్నాయి.
సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేయడంతో పాటు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే, ఓ కారు నుంచి ఆయిల్ లీక్ కావడంతో భారీగా మంటలు చెలరేగి.. మిగతా వాహనాలకు వ్యాపించాయి. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో పలువురు కారులోనే చిక్కుకుపోగా.. మంటల్లో చిక్కుకొని పలువురు సజీవ దహనమైనట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు.
ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈజిప్ట్‌లో రోడ్డు ప్రమాదాలు భారీగా జరుగుతుంటాయి. ప్రతి ఏటా వేలాది మంది ప్రాణాలను కోల్పోతున్నారు. అధ్వానమైన రోడ్లు, అతివేగం, ట్రాఫిక్ చట్టాలను సక్రమంగా అమలు చేయకపోవడం మూలంగానే ప్రమాదాలు సంభవిస్తున్నాయని పలు నివేదికలు పేర్కొంటున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

