Burger King | 27 ఏండ్లు నిరంతరాయంగా పనిచేశాడు..: బర్గర్ కింగ్ ఉద్యోగి అంకితభావానికి రూ. 3.5 కోట్ల ప్రతిఫలం
ప్రముఖ ఫాస్ట్‌ఫుడ్ చైన్ బర్గర్ కింగ్ ఉద్యోగి 27 ఏండ్ల పాటు ఒక్కరోజు కూడా పనికి దూరం కాకుండా ఉన్నందుకు కంపెనీతో పాటు సహోద్యోగులు మరపురాని కానుక అందించారు. బర్గర్ కింగ్ ఉద్యోగి కెవిన్ ఫోర్డ్‌కు క్యాండీ, పెన్లు, స్టార్‌బక్స్ కప్‌తో కూడిన బ్యాగ్‌ను ఇవ్వగా చాలా మంది పెదవివిరిచారు.
న్యూయార్క్ : ప్రముఖ ఫాస్ట్‌ఫుడ్ చైన్ బర్గర్ కింగ్ (Burger King) ఉద్యోగి 27 ఏండ్ల పాటు ఒక్కరోజు కూడా పనికి దూరం కాకుండా ఉన్నందుకు కంపెనీతో పాటు సహోద్యోగులు మరపురాని కానుక అందించారు. బర్గర్ కింగ్ ఉద్యోగి కెవిన్ ఫోర్డ్‌కు క్యాండీ, పెన్లు, స్టార్‌బక్స్ కప్‌తో కూడిన బ్యాగ్‌ను ఇవ్వగా చాలా మంది పెదవివిరిచారు. అయితే ఈ చిన్న బహుమతి బంపర్ ఆఫర్‌కు దారితీస్తుందని ఎవరూ ఊహించలేదు.
గత ఏడాది ఆయనకు వచ్చిన బహుమతులతో కూడిన వీడియో టిక్‌టాక్‌లో వైరల్ అయింది. కెవిన్ అంకితభావానికి, పనిపట్ల ఉన్న చిత్తశుద్ధికి మరింత ఆదరణ దక్కాలని పలువురు భావించారు. కెవిన్ కూతురు సెరీనా తండ్రి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కలేదని భావించి తానే రంగంలోకి దిగింది. తన తండ్రికి నిజంగా దక్కాల్సిన గౌరవం, పేరుప్రఖ్యాతుల కోసం ఆమె గోఫండ్‌మి క్యాంపెయిన్ లాంఛ్ చేసింది.
ఈ క్యాంపెయిన్‌కు అనూహ్య స్పందన రావడంతో ఏకంగా 4లక్షల డాలర్లు పైగా (రూ. 3.48 కోట్లు) విరాళాలు సమకూరాయి. ప్రజలను కెవిన్ ఫోర్డ్ అంకితభావం, చిత్తశుద్ధి ఎంతగా ప్రభావితం చేసిందో వసూలైన విరాళాల మొత్తం వెల్లడించింది. కెవిన్ ఫోర్డ్ లాస్‌వేగాస్‌లోని మెక్‌కారెన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బర్గర్ కింగ్ రెస్టారెంట్లో చెఫ్‌గా సేవలందిస్తున్నారు. కుటుంబ పోషణతో పాటు పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు కెవిన్ నిరంతరాయంగా కష్టపడ్డాడు.
Read More :
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Burger King
- employee
- Gift
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

