లండన్: బ్రిటన్ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. 90 శాతం నాలుక కోల్పోయిన మహిళకు చేతి కండరం నుంచి నాలుకను పునర్నిర్మించారు. గెమ్మా వీక్స్(37) నోటి క్యాన్సర్ బారిన పడింది. నాలుకకు రంధ్రం పడటంతో ఏమీ తినలేకపోయేది.
దీంతో వైద్యులు ఆమె నాలుకను దాదాపుగా తొలగించాలని, ఇంకా ఎప్పుడూ ఆమె మాట్లాలేరని చెప్పారు. మార్చి 6న కేంబ్రిడ్జ్లోని అద్దెన్బ్రూక్ దవాఖాన వైద్యులు శస్త్రచికిత్స చేసి నాలుకను తొలగించారు. ఆమె చేతి కణజాలాన్ని వినియోగించి నాలుకను పునర్నిర్మించారు.