Liz Truss | మౌనం వీడిన బ్రిటన్ ప్రధాని.. ప్రజలను క్షమాపణలు కోరిన లిజ్ ట్రస్
Liz Truss | బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ మూడు రోజుల తర్వాత మౌనం వీడారు. వాగ్దానాల ఉల్లంఘనకు క్షమించమని ప్రజలను కోరిన ఆమె.. తప్పకుండా తన వాగ్దానాలను నెరవేరుస్తానని చెప్పారు. ఏది ఏమైనా ‘లో ట్యాక్స్ అండ్ హై గ్రోత్’ ఫార్ములా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Liz Truss | ఇంటా, బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్.. ఎట్టకేలకు మూడు రోజుల తర్వాత మౌనం వీడారు. తాను, తమ ప్రభుత్వం వల్ల కొన్ని తప్పులు జరిగాయని అంగీకరించిన లిజ్ ట్రస్.. వాగ్దానాల ఉల్లంఘనకు క్షమించమని వేడుకుంటున్నానన్నారు. నిజాయితీ గల రాజకీయ నాయకుడు మాత్రమే తప్పులను అంగీకరిస్తారని, తాను అదే పని చేశానని చెప్పారు. తాను తీసుకొచ్చిన ‘లో ట్యాక్స్ అండ్ హై గ్రోత్’ ఫార్ములా కొనసాగి తీరుతానన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ కన్జర్వేటివ్ పార్టీ తన నాయకత్వంలోనే పనిచేస్తుందని చెప్పారు. కాగా, లిజ్ ట్రస్ బాధ్యతల నుంచి ఎందుకు పారిపోతున్నారని ప్రతిపక్షం విమర్శించింది.
లిజ్ ట్రస్ బ్రిటీష్ ప్రధానమంత్రిగా నియమితులై 40 రోజులు మాత్రమే అయ్యాయి. ఈ సందర్భంగా ఎన్నికల హామీలను తుంగలో తొక్కారని ప్రతిపక్ష పార్టీ ఆరోపించింది. లిజ్ పార్టీకి చెందిన ఎంపీలు స్వయంగా పలు ప్రశ్నలను లేవనెత్తడంతో ట్రస్ స్థానంలో మరో నేతను ప్రధానిని చేయవచ్చనే వార్తలు కూడా వినిపించాయి. కాగా, మూడు రోజుల తర్వాత మౌనం వీడియ ప్రధాని లిజ్ ట్రస్.. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తప్పులను అంగీకరించారు. ప్రజలు కూడా తమ తప్పులకు క్షమించాలని కోరింది. బ్రిటన్ ప్రజలకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలనుకుంటున్నానని, అయితే, దీనికి కొంత సమయం పడుతుందని చెప్పారు.
సొంత పార్టీ ఎంపీ జెరేమీ హంట్ పేరును లేవనెత్తకుండా.. ‘నేను ప్రధానమంత్రి పదవిలోకి వచ్చి నెల రోజులే అయ్యింది. విషయాలు సరైన మార్గంలో నడవడం లేదని అంగీకరిస్తున్నాను. త్వరలో వాటిని పరిష్కరిస్తాం. ఇప్పుడు ట్రాక్‌లోకి రావాలంటే ఇతర మార్గాలను అవలంబించాలి’ అని చెప్పారు. తక్కువ పన్ను, అధిక వృద్ధి ఫార్ములా కొనసాగుతుందని చెప్పిన లిజ్ ట్రస్.. ప్రస్తుతానికి ఆర్థిక వ్యవస్థను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడమే ప్రాధాన్యంగా పనిచేయనున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

