Rishi Sunak | ప్రధానిగా బ్రిటన్ ప్రజల మనసు గెలిచిన రిషి సునాక్.. సర్వేలో బోరిస్ కంటే ఎక్కువ ఓట్లు
నవంబర్ 9-16 తేదీల్లో నిర్వహించిన సర్వేలో 47 శాతం మంది రిషిని ఇష్టపడుతున్నట్టు చెప్పారు
Rishi Sunak : కష్టమైన పరిస్థితుల్లో బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రిషి సునాక్‌కు ప్రజల మద్థతు పెరుగుతోంది. నవంబర్ ఇప్సాస్ పొలిటికల్ మానిటర్’ నిర్వహించిన సర్వేలో ఆయనకు 47 శాతం ఓట్లు వచ్చాయి. ఈ సర్వేలో రిషి సునాక్ తమ పార్టికి చెందిన మాజీ ప్రధాని బోరిస్ జాన్సస్ కంటే ఎక్కువ ఓట్లు గెలుచుకున్నారు. నవంబర్ నెల ప్రారంభంలో (9-16 తేదీల్లో) నిర్వహించిన సర్వేలో 47 శాతం మంది రిషిని ఇష్టపడుతున్నట్టు చెప్పారు. 41 శాతం మంది మాత్రం రిషి అంటే ఇష్టం లేదని తెలిపారు. 26 శాతం మంది తమకు కన్జర్వేటివ్ పార్టీ అంటే ఇష్టమని పోలింగ్‌లో తెలిపారు. కన్జర్వేటివ్ పార్టీ కంటే రిషి సునాక్‌కు ఎక్కువ ఓట్లు రావడం విశేషం. ఈ సర్వేలో ‘మంచి ప్రధాని ఎలా ఉండాలి?’ అనే విషయంలో ప్రతిపక్ష లేబర్‌పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ను కూడా రిషి వెనక్కి నెట్టాడు.
లిజ్ ట్రస్ రాజీనామా చేయడంతో అక్టోబర్ 25వ తేదీన రిషి బ్రిటన్ ప్రధాని బాధ్యతలు చేపట్టారు. బ్రిటన్ ప్రధాని పీఠం అధిరోహించిన భారత సంతతి వ్యక్తిగా, తొలి హిందువుగా రిషి రికార్డు క్రియేట్ చేశారు. కరోనా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న దేశాన్ని గట్టెక్కించేందుకు చర్యలు తీసుకుంటానని రిషి ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రధాని అయిన వెంటనే అందుకు తగ్గ చర్యలు మొదలుపెట్టారు. నవంబర్ 25వ తేదీతో ఆయన బ్రిటన్ ప్రధానిగా నెల రోజులు పూర్తి చేసుకున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

