పన్నుల తగ్గింపు విషయంలో యూటర్న్.. ప్రజలకు క్షమాపణలు చెప్పిన బ్రిటన్ ప్రధాని
Britain PM | ఇటీవల ఎన్నికైన బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ ఆ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ప్రజలపై పన్నుల భారం తగ్గిస్తానని ప్రధాని ఎన్నికల సమయంలో చెప్పిన ఆమె..
ఇటీవల ఎన్నికైన బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ ఆ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ప్రజలపై పన్నుల భారం తగ్గిస్తానని ప్రధాని ఎన్నికల సమయంలో చెప్పిన ఆమె.. చెప్పినట్లే ప్రధాని అయిన తర్వాత పన్నులు తగ్గించారు. అయితే ఇలా చేయడం వల్ల బ్రిటన్ ఆర్థిక సంక్షోభంలో పడిపోయింది. ఈ క్రమంలోనే ఆర్థిక మంత్రి క్వాసి క్వార్టెంగ్ను ఆమె పదవి నుంచి తప్పించారు. ఈ పదవిలోకి జెరెమీ హంట్ వచ్చారు.
వచ్చీరావడంతోనే గత నెలలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను ఆయన తోసిపుచ్చారు. పన్నులు తగ్గించడం వల్ల ప్రభుత్వంపై భారం పడుతోందంటూ.. పన్ను తగ్గింపులను తొలగించారు. ఈ సందర్భంగా లిజ్ మాట్లాడుతూ.. ‘జరిగిన తప్పులకు బాధ్యత వహించి క్షమాపణలు చెప్పాలని అనుకుంటున్నా. మేం మరీ వేగంగా చాలా దూరం పరిగెత్తాం’ అని అన్నారు.
అదే సమయంలో దేశానికి సేవ చేయాలని తను ధృడ సంకల్పంతో ఉన్నట్లు చెప్పారు. పన్ను రేట్ల విషయంలో యూటర్న్ తీసుకోవడంతో ప్రభుత్వంలో ఆమె ప్రాముఖ్యత పడిపోయిందని, త్వరలోనే పదవి నుంచి తప్పుకుంటుందని వార్తలు వచ్చాయి. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జెరెమీ హంట్ ప్రధాని బాధ్యతలు కూడా స్వీకరిస్తారని గుసగుసలు వినిపించాయి. వీటిపై తేల్చేసిన లిజ్ ట్రస్.. తాను బ్రిటన్ ప్రధానిగా కొనసాగుతనని స్పష్టం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

