Plane Crash: తండ్రి బీరు తాగుతుండగా.. విమానాన్ని నడిపిన 11 ఏళ్ల కుమారుడు.. షాకింగ్ వీడియో
Plane Crash: ప్రైవేటు విమానం కాక్‌పిట్‌లో తండ్రి బీరు తాగుతుండగా.. 11 ఏళ్ల కుమారుడు ఆ ప్లేన్‌ను కంట్రోల్ చేశాడు. ప్లేన్‌ను ఎలా నడపాలో తాగుతూనే ఆ తండ్రి తన కొడుక్కి వివరించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అయితే ఆ తండ్రీకొడుకులు విమాన ప్రమాదంలో మరణించారు.
బ్యూనస్ ఏరిస్: బ్రెజిల్లో తండ్రీకొడుకులు విమానాన్ని నడుపుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అయితే తండ్రి బీరు తాగుతుండగా.. 11 ఏళ్ల కొడుకు ఆ విమానాన్ని నడుపుతున్న వీడియో ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. నిజానికి ఆ తండ్రీకొడుకులు విమానం ప్రమాదం(Plane Crash)లో మరణించారు. కానీ ఆ ఇద్దరికి చెందిన ఓ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.
Avião bimotor Beechcraft Baron 58, de matrícula PR-IDE, "caiu matando pai e filho" a Aeronave cair em uma região de mata fechada, na divisa de Rondônia e Mato Grosso. Os destroços da aeronave foram localizados na manhã deste domingo (30) o pecuarista Garon Maia e o filho.🇧🇷 pic.twitter.com/nOEBpVZJup
— D' AVIATION 🇧🇷 (@pgomes7973) August 1, 2023
జూలై 29వ తేదీన జరిగిన ప్రమాదంలో.. 42 ఏళ్ల గేరన్ మాయా, అతని కుమారుడు ఫ్రాన్సిస్కో మాయా ప్రాణాలు కోల్పోయారు. అడవిలో ఆ విమానం కూలింది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ఆ ఘటన జరగడానికి కొన్ని క్షణాల ముందు జరిగిందా లేదా గతంలో తీసిన వీడియోనా అన్న విషయం తేలలేదు. మాయా బీరు తాగుతున్న సమయంలో.. అతని కొడుకు విమాన కంట్రోలింగ్‌ను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. విమానాన్ని ఎలా నడపాలో కూడా తన కుమారుడికి ఆ తండ్రి నేర్పుతున్నట్లు వీడియోలో ఉంది. ప్లేన్ కంట్రోలింగ్ గురించి తాగుతూ వివరించాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

