రియో: నాలుగు నెలలుగా అదృశ్యమైన బ్రెజిల్ నటుడు జెఫర్సన్ మచాడో(Jefferson Machado) శవమై తేలాడు. అతని మృతదేహాన్ని ఓ శవపేటికలో గుర్తించారు. రియో డి జనరోలోని ఓ ఇంట్లో అతని శవపేటికను గుర్తించారు. 44 ఏళ్ల ఆ నటుడి శరీరాన్ని చెయిన్‌తో కట్టేశారు. వుడెన్ బాక్సులో అతన్ని ప్యాక్ చేశారు. కాంక్రీట్ గుంతలో ఆ శవపేటికను పూడ్చిపెట్టారు. ఓ ఇంట్లోని పెరిటలో ఆరు గజాల లోతులో ఆ శవపేటికను పోలీసులు గుర్తించారు. అయితే వేలిముద్రల ఆధారంగా ఆ మృతదేహం నటుడిదే అని పసికట్టారు. జెఫర్సన్‌ను అత్యంత కిరాతకంగా చంపేసినట్లు అతని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. అద్దె ప్రాపర్టీలో శవపేటికను గుర్తించిన పోలీసులు ఆ ప్రాపర్టీ ఎవరిదన్న కోణంలో విచారణ చేపడుతున్నారు.