బ్రెజిల్లో బోల్సొనారో మద్దతుదారుల విధ్వంసం.. నేషనల్ కాంగ్రెస్, సుప్రీంకోర్టుపై దాడి
Brazil | బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో మద్దతుదారులు దేశ రాజధాని బ్రెసీలియాలో విధ్వంసం సృష్టించారు. 2021, డిసెంబర్లో అమెరికాలో జరిగిన యూఎస్ క్యాపిటల్ విధ్వంసం తరహాలో..
బ్రెసీలియా: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో మద్దతుదారులు దేశ రాజధాని బ్రెసీలియాలో విధ్వంసం సృష్టించారు. 2021, డిసెంబర్లో అమెరికాలో జరిగిన యూఎస్ క్యాపిటల్ విధ్వంసం తరహాలో.. నేషనల్ కాంగ్రెస్, సుప్రీంకోర్టు, అధ్యక్షుడి ప్యాలెస్‌పై దాడిచేశారు. ఆదివారం మధ్యాహ్నం ఆకుపచ్చ, పసుపు దుస్తులు వేసుకుని రోడ్లపైకి వచ్చిన వందలాది మంది నిరసనకారులు నేషనల్ కాంగ్రెస్, సుప్రీంకోర్టు, అధ్యక్షుడి ప్యాలెస్‌లోకి చొచ్చుకెళ్లి విధ్వంసానికి పాల్పడ్డారు. అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఆందోళనకారుల దాడిలో నేషనల్ కాంగ్రెస్ భవనం ధ్వంసమైంది. బిల్డింగ్‌పై ‘జోక్యం చేసుకోండి (ఇంటర్వెన్షన్)’ అంటూ సైన్యాన్ని ఉద్దేశించి బ్యానర్లు ఎగరేశారు. చట్టసభ్యుల కార్యాలయాల్లోకి చొరబడి నాశనం చేశారు. ఇప్పుడీ దాడి దృష్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

దేశంలో గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో లులా డా సిల్వా చేతిలో బోల్సనారో ఓడిపోయారు.అప్పటి నుంచి.. బోల్సనారో మద్దతుదారులు నిరసనలు చేస్తూనే ఉన్నారు. దేశంలోని మిలిటరీ స్థావరాలకు వెళ్లి.. రాజకీయ విషయంలో సైన్యం జోక్యంచేసుకోవాలని కోరుతూవస్తున్నారు.

కాగా, అత్యున్నత పరిపాలనా భవనాలపై దాడిఘటనపై అధ్యక్ష, మాజీ అధ్యక్షులు తీవ్రంగా ఖండిచారు. దేశ చరిత్రలో ఇదొక చీకటి రోజుని, ఫాసిస్ట్‌లు చాలా తప్పు చేశారని అధ్యక్షుడు లూలా డా సిల్వా ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజా భవనాలపై జరిగిన దోపిడీ, దండయాత్రను ఖండిస్తున్నాని బోల్సొనారో అన్నారు. ఈ ఘటనల వెనుక తానున్నానని అధ్యక్షుడు లూలా చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదు. కానీ.. శాంతియుతంగా నిరసనలు చేయడంలో తప్పులేదని ట్వీట్ చేశారు.
All eyes need to be on Brazil right now. Democracy is completely under attack. Bolsonaro supporters are invading Congress, the presidential
palace, and realms of power in Brazil.
Unbelievable scenes.— Dr. Jennifer Cassidy (@OxfordDiplomat) January 8, 2023
తాజా దాడి ఘటనలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ఖండిచారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడికి పాల్పడడమేనని బైడెన్ అన్నారు.
I condemn the assault on democracy and on the peaceful transfer of power in Brazil. Brazil’s democratic institutions have our full support and the will of the Brazilian people must not be undermined. I look forward to continuing to work with @LulaOficial.
— President Biden Archived (@POTUS46Archive) January 8, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

