మళ్లీ ఆమెనే హోంశాఖ మంత్రి.. రిషి సునాక్‌పై విమర్శల వెల్లువ
Rishi Sunak:ఆరు రోజుల క్రితమే బ్రిటన్ హోంశాఖ మంత్రిగా సుయిల్లా బ్రెవర్మాన్ రాజీనామా చేశారు. ఓ సెక్యూర్టీ ఉల్లంఘన కేసులో ఆమె లిజ్ ట్రస్ ప్రభుత్వం నుంచి తప్పుకున్నారు. కానీ కొత్త ప్రధాని రిషి సునాక్ మళ్లీ బ్రెవర్మాన్కే హోంశాఖను అప్పగించారు. దీంతో ప్రతిపక్ష లేబర్ పార్టీ ప్రధాని సునాక్‌పై విమర్శలు గుప్పిస్తోంది. రిషి
లండన్: ఆరు రోజుల క్రితమే బ్రిటన్ హోంశాఖ మంత్రిగా సుయిల్లా బ్రెవర్మాన్ రాజీనామా చేశారు. ఓ సెక్యూర్టీ ఉల్లంఘన కేసులో ఆమె లిజ్ ట్రస్ ప్రభుత్వం నుంచి తప్పుకున్నారు. కానీ కొత్త ప్రధాని రిషి సునాక్ మళ్లీ బ్రెవర్మాన్కే హోంశాఖను అప్పగించారు. దీంతో ప్రతిపక్ష లేబర్ పార్టీ ప్రధాని సునాక్‌పై విమర్శలు గుప్పిస్తోంది. రిషి సునాక్ ఇవాళ పూర్తి స్థాయి క్యాబినెట్‌తో భేటీ అయ్యారు. అయితే సుయిల్లా బ్రెవర్మాన్‌కు మళ్లీ హోంశాఖను అప్పగించిన అంశం వివాదాస్పదం అవుతోంది.
రెండు సార్లు డేటా ఉల్లంఘనలకు పాల్పడినట్లు కొన్ని రోజుల క్రితమే బ్రెవర్మాన్ అంగీకరించారు. ఆ నేపథ్యంలో ఆమె తన పదవికి రాజీనామా చేశారు. కానీ సునాక్ ఎందుకు ఆమెకు అంత ప్రియార్టీ ఇస్తున్నారో అర్థం కావడం లేదని 10 డౌనింగ్ స్ట్రీట్ మాజీ చీఫ్ గెవిన్ వార్వెల్ ఆరోపించారు. బ్రెవర్మాన్ అపాయింట్మెంట్ సునాక్‌కు అత్యంత కష్టమైన ఛాయిస్ అని బార్వెల్ అన్నారు.
కన్జర్వేటివ్ పార్టీ గబ్బు రాజకీయాలకు పాల్పడుతోందని, అందుకే బ్రెవర్మాన్‌కు మళ్లీ హోంశాఖ అప్పగించినట్లు లేబర్ పార్టీ నేత బ్రిడ్జెట్ ఫిలిప్సన్ ఆరోపించారు. సునాక్ ప్రధాని కావడానికి ఓ గలీజ్ డీల్ జరిగినట్లు ఆమె విమర్శించారు. సమగ్ర ప్రభుత్వాన్ని నడుపుతానన్న సునాక్ మాటల్ని విశ్వసించలేమని ఆమె ఆరోపించారు. దేశ భవిష్యత్తు గురించి చర్చించాలని, కానీ కన్జర్వేటివ్ పార్టీ భవిష్యత్తు కాదు అని ఆమె అన్నారు.
విదేశాంగ మంత్రి జేమ్స్ క్లెవర్లీ మాత్రం సునాక్ నిర్ణయాన్ని సమర్థించారు. హోంమంత్రిగా బ్రెవర్మాన్‌ను మళ్లీ నియమించడం పట్ల క్లెవర్లీ సంతోషం వ్యక్తం చేశారు. తప్పు చేసినట్లు ఒప్పుకున్న ఆమె, ఆ తప్పును అంగీకరించారని జేమ్స్ తెలిపారు. బ్రెవర్మాన్ చాలా కఠినంగా నేరాలను అదుపు చేశారన్నారు. సరిహద్దుల్ని కూడా ఆమె సమర్థవంతంగా రక్షించినట్లు చెప్పారు. ఏ వ్యక్తి అండదండలు లేకుండానే సునాక్ ప్రధాని పీఠాన్ని అధిరోహించారని క్లెవర్లీ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి’
Agriculture university | వీసీ అల్డాస్ జానయ్యపై నో యాక్షన్.. ప్రభుత్వం దేని కోసం ఉన్నదంటూ నిరసనలు.. వీడియో
Man Kills Nephew To Sell Organs | అవయవాలు అమ్మి డబ్బు సంపాదించేందుకు.. బాలుడిని చంపిన బంధువు
Fire accident | ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురూ దుర్మరణం..!
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

