చరిత్రలో ఈరోజు: తొలి ఓటమిని చవిచూసిన లెజెండ్ బాక్సర్ మహమ్మద్ అలీ
బాక్సింగ్‌లో లెజెండ్‌గా పేరుగాంచిన మహమ్మద్ అలీ.. 1967 లో సరిగ్గా ఇదే రోజున తొలి ఓటమిని రుచి చూశారు. 31 సార్లు ఘనమైన విజయాలు అందుకున్న మహమ్మద్ అలీ.. ఫ్రేజర్ చేతిలో...
Today History: ‘ఎంతవారలైనా ఏదో ఒకరోజు ఓటమిని ముద్దాడాల్సిందే’.. అని చెప్తుంటారు మన పెద్దవారు. బాక్సింగ్‌లో లెజెండ్‌గా పేరుగాంచిన మహమ్మద్ అలీ.. 1967 లో సరిగ్గా ఇదే రోజున తొలి ఓటమిని రుచి చూశారు. 31 సార్లు ఘనమైన విజయాలు అందుకున్న మహమ్మద్ అలీ.. ఫ్రేజర్ చేతిలో ఓడిపోయారు. దాంతో ఆయన వద్ద ఉన్న హెవీ వెయిట్ ఛాంపియన్ షిప్ బెల్ట్‌ను వెనక్కితీసుకున్నారు.
విజయాల పరంపరతో దూసుకుపోతున్న మహమ్మద్ అలీ.. సాయుధ దళాల్లో సేవ చేసేందుకు నిరాకరించి బాక్సింగ్ రింగ్‌కు అంకితమయ్యారు. తొలిసారి రింగ్‌లోకి దిగిన నాటి నుంచి అప్రతిహతంగా దూసుకుపోయిన ఆయన.. 1971 లో న్యూయార్క్ మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో జరిగిన ‘ఫైట్ ఆఫ్ ది సెంచురీ’ గా పేర్కొన్న ప్రపంచ హెవీ వెయిట్ ఛాంపియన్ టైటిల్ పోటీలో జో ఫ్రెజర్తో తలపడి తొలిసారి ఓటమి పాలయ్యారు. ఈ మ్యాచ్‌లో 15 రౌండ్ల పాటు పోరాడారు. కొన్నాళ్లపాటు రింగ్‌కు దూరంగా ఉన్న మహ్మద్ అలీ బలహీనంగా మారారు. ఫ్రేజర్ తన ఎడమ హుక్తో మహమ్మద్ అలీని ఇబ్బంది పెట్టి పంచ్‌ల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్ లో అలీ రెండుసార్లు నేలపై పడిపోయాడు. అప్పటివరకు మహమ్మద్ అలీ 31 మ్యాచులను గెలుపొందిన రికార్డును కలిగిఉన్నారు.
1973లో ఫోర్మాన్ చేతిలో ఓడిపోయిన ఫ్రేజర్.. 1974లో మళ్లీ మహమ్మద్ అలీతో తలపడాల్సి వచ్చింది. 12 రౌండ్ల బౌట్లో ఈ సారి అలీ విజయం సాధించారు. 1975 లో ఫిలిప్పీన్స్‌లో వీరి మూడోసారి ముఖాముఖి పోటీలో.. 14 రౌండ్ల తర్వాత టెక్నికల్ నాకౌట్ ద్వారా మహమ్మద్ అలీ గెలిచారు.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- 2014: కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తున్న మలేషియా విమానం అదృశ్యం. 227 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది గల్లంతు
- 1985: బీరుట్‌లోని మసీదు సమీపంలో కారు బాంబు పేలి 80 మంది దుర్మరణం
- 1979: తొలిసారి మార్కెట్లోకి సీడీలను విడుదల చేసిన ఫిలిప్స్, సోనీ కంపెనీలు
- 1948: ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ స్థాపన
- 1953: రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే జననం
- 1942: రెండవ ప్రపంచ యుద్ధంలో బర్మాలోని రంగూన్ను స్వాధీనం చేసుకున్న జపాన్ దళాలు
- 1930: భారతదేశ స్వాతంత్ర్యం కోసం శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించిన మహాత్మా గాంధీ
- 1921: స్పానిష్ ప్రధాన మంత్రి ఎడ్వర్డో డాటో ఇరాడియర్ దారుణహత్య
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

