Boat capsized | ఇటలీ పడవ ప్రమాదంలో 59కి పెరిగిన మృతుల సంఖ్య
Boat capsized | ఇటలీ పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఇవాళ మరో 19 మంది మృతదేహాలు లభ్యం కావడంతో మొత్తం మృతుల సంఖ్య 59కి చేరుకుంది. ఆదివారం ఉందయం దక్షిణ కలాబ్రియా రీజియన్‌లో భారీ బండరాయిని ఢీకొట్టి పడవ మునిగిపోయింది.
కట్రో: ఇటలీ పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఇవాళ మరో 19 మంది మృతదేహాలు లభ్యం కావడంతో మొత్తం మృతుల సంఖ్య 59కి చేరుకుంది. ఆదివారం ఉందయం దక్షిణ కలాబ్రియా రీజియన్‌లో భారీ బండరాయిని ఢీకొట్టి పడవ మునిగిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో మొత్తం 200 మంది ఉన్నారు. వారిలో 59 మంది మరణించగా, 81 మంది ప్రాణాలతో బయటపడ్డారు.
రెస్క్యూ టీమ్స్ కాపాడిన 81 మందిలో 20 మందికి గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా మరణించిన 59 మంది 12 మంది చిన్నారులు ఉన్నారు. ప్రమాద సమయంలో పడవలో సామర్థ్యానికి మించి జనం ఉండటం.. సముద్రంలో బలమైన ఈదురు గాలులు వీయడం ప్రమాదానికి కారణమైందని ఇటాలియన్ కోస్ట్‌గార్డ్స్ తెలిపారు.
ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్ దేశాలకు చెందిన వలసదారులు యూరప్‌కు వెళ్తుండగా పడవ ప్రమాదం జరిగింది. ఆఫ్రికా దేశాల నుంచి ప్రమాదకర పరిస్థితుల్లో యూరప్ దేశాలకు వెళ్తూ వలసదారులు మృతిచెందిన ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. 2022లో సముద్ర మార్గంలో ఇటలీకి వచ్చిన వలసదారుల సంఖ్య 14,000 కాగా, అంతకుముందు ఏడాది ఆ సంఖ్య కేవలం 5,200 మాత్రమే ఉండెనని అధికారులు చెబుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

