Watch: టూరిస్ట్ బోటులో చెలరేగిన మంటలు.. ముగ్గురు పర్యాటకులు గల్లంతు
Boat Bursts Into Flames | ఒక టూరిస్ట్ బోటులో మంటలు చెలరేగాయి (Boat Bursts Into Flames). అందులో ప్రయాణించిన పర్యాటకుల్లో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. దీంతో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కైరో: ఒక టూరిస్ట్ బోటులో మంటలు చెలరేగాయి (Boat Bursts Into Flames). అందులో ప్రయాణించిన పర్యాటకుల్లో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. దీంతో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈజిప్ట్‌లోని ఎర్ర సముద్రం తీరంలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 6న విదేశీ పర్యాటకులున్న బోటు పోర్ట్ గాలిబ్ నుంచి బయలుదేరింది. ఆదివారం అది అక్కడకు తిరిగి రావాల్సి ఉంది. సొరచేపలు, డాల్ఫిన్లను చూసేందుకు ప్రసిద్ధి చెందిన టూరిస్ట్ స్పాట్ ఎల్ఫిన్‌స్టోన్ రీఫ్‌కు ఆ బోటు వెళ్లింది. అయితే ఆదివారం ఆ బోటులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈజిప్ట్ తీరంలోని మార్సా ఆలం వద్ద ఈ సంఘటన జరిగింది.
కాగా, దట్టంగా మంటలు ఎగసిపడిన ఆ బోటులో 14 సిబ్బంది, 15 మంది బ్రిటీష్ పర్యాటకులతో కలిపి మొత్తం 29 మంది ఉన్నారు. ఈ ప్రమాదం నేపథ్యంలో ముగ్గురు బ్రిటీషర్లు గల్లంతయ్యారు. మిగతా 12 మంది బ్రిటీష్ పర్యాటకులను సురక్షితంగా తీరానికి తరలించినట్లు ఈజిప్ట్ విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. వీరికి ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. మంటలు చెలరేగిన బోటు నుంచి కనిపించకుండా పోయిన ముగ్గురు బ్రిటీషర్లను వెతికేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
మరోవైపు బోటులోని ఇంజిన్ రూమ్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వ్యాపించినట్లుగా ఈజిప్ట్ అధికారులు భావిస్తున్నారు. టూరిస్ట్ బోటులో మంటలు చెలరేగిన ఈ ప్రమాదంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతామని చెప్పారు. కాగా, బోటు నుంచి భారీగా మంటలు ఎగసిపడుతున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
حريق مركب سفاري بطول ٤٠ متر اسمها hurricane في جنوب البحر الأحمر و بالتحديد منطقة Elphinstone و انقاذ معظم السياح فيما عدا ٣ لا يزالوا مفقودين و يعتقد ان جنسيتهم انجليز، نتمني السلامه للجميع و ربنا ينجي المفقودين.
المصدر: شهود عيان pic.twitter.com/hRg1YlzNb7
— RedSea_Anglers ⚓🚢 🇪🇬🇱🇧🇬🇷 (@HanySadekk) June 11, 2023
Also Read:
Watch: | ప్రిన్స్ విలియం గౌరవార్థ మిలిటరీ కవాతులో.. సొమ్మసిల్లి పడిపోయిన బ్రిటీష్ రాయల్ గార్డులు
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- boat
- British Tourists
- coast
- Egypt
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

