Bird Flu | అమెరికాలో మరో వ్యక్తికి బర్డ్ ఫ్లూ..! కంటి నమూనాల్లో పాజిటివ్..!
Bird Flu | మరో వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకింది. అమెరికాలో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకడం ఇది రెండోసారి. మిచిగాన్‌లోని ఓ రైతుకు ఈ బర్డ్‌ఫ్లూ సోకినట్లుగా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ (MDHHS) పేర్కొంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) H5N1 సోకిన వ్యక్తి డెయిరీ ఫామ్‌లో పని చేస్తున్నట్లుగా తెలిపింది.
Bird Flu | మరో వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకింది. అమెరికాలో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకడం ఇది రెండోసారి. మిచిగాన్‌లోని ఓ రైతుకు ఈ బర్డ్‌ఫ్లూ సోకినట్లుగా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ (MDHHS) పేర్కొంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) H5N1 సోకిన వ్యక్తి డెయిరీ ఫామ్‌లో పని చేస్తున్నట్లుగా తెలిపింది. సదరు వ్యక్తిలో స్థానిక అధికారులు బర్డ్‌ఫ్లూ లక్షణాలను గుర్తించినట్లు సీడీసీ పేర్కొంది. బాధితుడి రెండు రెండు శాంపిల్స్ సేకరించామని.. ఒకటి ముక్కు నుంచి, మరొకటి బాధితుడి కంటి నుంచి సేకరించినట్లు పేర్కొంది.
ముక్కు నుంచి తీసిన శాంపిల్‌ను రాష్ట్ర ఆరోగ్య శాఖ ల్యాబొరేటరీకి పంపగా, ఇన్ఫ్లుఎంజా వైరస్ నెగిటివ్‌గా తేలింది. కంటి నమూనాను సీడీసీకి పంపగా.. అక్కడ ఏ (H5) వైరస్‌గా నిర్ధారించారు. మళ్లీ నాసికా నమూనాను సేకరించి సీడీసీకి పంపారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి బాగనే ఉందని ఎండీహెచ్ఎస్ పేర్కొంది. ఇంతకు ముందు తొలిసారిగా ఏప్రిల్‌లో టెక్సాస్ ఓ వ్యక్తికి బర్డ్‌ఫ్లూ పాజిటివ్‌గా తేలింది. ఈ వ్యక్తి సైతం బర్డ్‌ఫ్లూ సోకిన ఆవులకు దగ్గర ఉండడంతో సోకినట్లుగా గుర్తించారు. ఆవుల నుంచి మనిషికి బర్డ్‌ఫ్లూ సోకిన మొదటి కేసు ఇదే. వ్యక్తి శరీరంలో కనిపించే వైరస్ దాదాపు టెక్సాస్‌లోని ఆవులు, పక్షులలో కనిపించే వైరస్‌లానే ఉంటుందని పేర్కొన్నారు. దీన్ని నివారించేందుకు పౌల్ట్రీ, డెయిరీ ఫామ్‌లలో పనిచేసే వ్యక్తులు ఫ్లూ టీకాలు వేయాలని ఎండీహెచ్హెచ్ఎస్ సూచించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

