వాషింగ్టన్, ఏప్రిల్ 15: రష్యాపై అమెరికా కన్నెర్ర చేసింది. రష్యా దౌత్యవేత్తలు 10 మందిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బహిష్కరణ వేటు వేశారు. తమ దేశాన్ని విడిచి వెళ్లాలని ఆదేశించారు. దాదాపు 40 వరకు వ్యక్తులు, సంస్థలపై ఆంక్షలు విధించారు. గత ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని, ప్రభుత్వ సంస్థలను హ్యాక్ చేసిందని నిర్ణయానికొచ్చిన బైడెన్ ప్రభుత్వం తాజా చర్యలు చేపట్టింది.