అమెరికాలో పసిపిల్లల ఆహారానికి కొరత
మెరికాలో పసిపిల్లల ఆహారానికి(సెరెలాక్, నాన్ ప్రో లాంటి ఫార్ములా) కొరత ఏర్పడింది. దేశంలోనే అతిపెద్దదైన అబాట్ న్యూట్రిషన్ ప్లాంట్‌ను మూసివేయడంతో కొన్ని రోజులుగా ఈ ఆహార ఫార్ములా సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
వాషింగ్టన్, మే 19: అమెరికాలో పసిపిల్లల ఆహారానికి(సెరెలాక్, నాన్ ప్రో లాంటి ఫార్ములా) కొరత ఏర్పడింది. దేశంలోనే అతిపెద్దదైన అబాట్ న్యూట్రిషన్ ప్లాంట్‌ను మూసివేయడంతో కొన్ని రోజులుగా ఈ ఆహార ఫార్ములా సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో అధ్యక్షుడు బైడెన్ డిఫెన్స్ ప్రొడక్షన్ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. పసిపిల్లల ఆహార ఫార్ములా ఉత్పత్తిని పెంచడానికి చర్యలు చేపట్టారు.
ఫార్ములా తయారీకి అవసరమైన ముడి సరుకును విదేశాల నుంచి వేగంగా దిగుమతి చేసుకొనేందుకు రక్షణ విమానాలను కేటాయించారు. దీనికి అమెరికా ‘ఆపరేషన్ ఫ్లై ఫార్ములా’ అని పేరు పెట్టింది. ‘దేశవ్యాప్తంగా తల్లిదండ్రులందరూ పిల్లలకు ఆహారం కోసం ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితి ఎంత బాధాకరమైనదో ఒక తండ్రిగా, ఒక తాతగా నాకు తెలుసు’ అని బైడెన్ డిఫెన్స్ ప్రొడక్షన్ చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తూ వ్యాఖ్యానించారు. ఈ చట్టం ప్రకారం.. ఫార్ములా తయారీ సంస్థలు చిన్నపిల్లల ఫార్ములాను బయట అమ్మకూడదు. ప్రభుత్వానికే ఇవ్వాలి. అబాట్ న్యూట్రిషన్ సంస్థలో క్రోనోబాక్టర్ బాక్టీరియా కనిపించడంతో సంస్థను మూసివేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Act
- Infant Formula
- Joe Biden
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

