ప్రత్యామ్నాయానికి ప్లాన్!
ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో రష్యాపై అమెరికా విధించిన చమురు ఆంక్షలు, సహజవాయువు విషయంలో ఐరోపా దేశాలకు రష్యా చేస్తున్న హెచ్చరికలు చర్చనీయాంశంగా మారాయి.
- ఉక్రెయిన్ సంక్షోభంతో ఆంక్షల పర్వం
- రష్యాపై అమెరికా చమురు ఆంక్షలు
- ఐరోపాకు రష్యా గ్యాస్ హెచ్చరికలు
- ప్రత్యామ్నాయాల కోసం అన్వేషణ
- సౌదీ, ఇరాన్ వైపు అమెరికా చూపు
- ఖతార్‌పై భారం వేసిన ఐరోపా దేశాలు
కీవ్: ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో రష్యాపై అమెరికా విధించిన చమురు ఆంక్షలు, సహజవాయువు విషయంలో ఐరోపా దేశాలకు రష్యా చేస్తున్న హెచ్చరికలు చర్చనీయాంశంగా మారాయి. ఉక్రెయిన్ విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న రష్యా నుంచి ముడి చమురు, గ్యాస్, ఎనర్జీని దిగుమతి చేసుకోబోమని అమెరికా ప్రకటించింది. దీంతో దేశీయ చమురు అవసరాలను అమెరికా ఎలా సంతృప్తి పరుస్తుందన్న సందేహం అందరిలోనూ కలిగింది. అయితే, రష్యాపై చమురు ఆంక్షలు విధించినప్పటికీ, దేశీయ ఇంధన అవసరాలను తీర్చేలా బైడెన్ సర్కారు పావులు కదుపుతున్నది. ఇందులో భాగంగానే వెనుజువెలా, సౌదీ అరేబియా, యూఏఈ, ఇరాన్ వంటి దేశాల నుంచి చమురు ఉత్పత్తిని పెంచి.. రష్యా నుంచి నిలిచిపోయిన చమురులోటును భర్తీ చేయాలని అమెరికా యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇదే సమయంలో అమెరికాకు ఎగుమతి చేస్తున్న 8 శాతం చమురును చైనా, భారత్‌కు మళ్లించి ఆర్థికంగా పుంజుకోవాలని రష్యా కూడా భావిస్తున్నది. ఇదే జరిగితే దేశంలో ఇంధన ధరలు దిగిరావొచ్చని విశ్లేషకులు అంటున్నారు.
ఖతార్‌పైనే ఆశలు
నార్డ్ స్ట్రీమ్ 1 పైప్‌లైన్ ద్వారా ఐరోపా దేశాలకు సరఫరా చేస్తున్న సహజవాయువును నిలిపేస్తామని రష్యా హెచ్చరించింది. ఐరోపా దేశాలకు 40 శాతం సహజవాయువు రష్యా నుంచే దిగుమతి అవుతున్నది. ఈ క్రమంలో నార్డ్ స్ట్రీమ్ 1 పైప్‌లైన్‌ను రష్యా ఒకవేళ మూసివేస్తే చేపట్టాల్సిన నష్టనివారణ చర్యలను కూడా ఐరోపా దేశాలు ముందుగానే నిర్ణయించుకొన్నాయి. గ్యాస్ ఉత్పత్తిలో ముందున్న ఆస్ట్రేలియా, ఖతార్, అమెరికా నుంచి సహజవాయువును దిగుమతి చేసుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.
మీరే నష్టపోతారు!: రష్యా
తమపై ఆంక్షలు విధించడం ద్వారా ఐరోపా దేశాలు తీవ్రంగా నష్టపోతాయని రష్యా హెచ్చరించింది. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు తాము ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని వెల్లడించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

