Home
International
Biden Admin Proposes 18 Month Delay In Calculating Prevailing Wages Of H 1b Other Visas
హెచ్1బీ వీసాదారులకు ఊరట
కనీస వేతన నిబంధన మరో 18 నెలలు వాయిదా

వాషింగ్టన్, మార్చి 23: అమెరికాలో హెచ్1బీ, ఇతర వీసాదారుల కనీస వేతన పరిమితిని భారీగా పెంచుతూ ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయం అమలును మరో 18 నెలలు వాయిదా వేయాలని ప్రస్తుత బైడెన్ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో కనీస వేతన పెంపు నిబంధన అమలులో తలెత్తే న్యాయ, విధానపరమైన సమస్యలను పరిశీలించేందుకు కార్మిక శాఖకు మరింత సమయం లభిస్తుంది. హెచ్1బీ వీసాదారుల వార్షిక వేతన పరిమితి 65 వేల డాలర్లుగా ఉండేది. దీనిని లక్షా పది వేల డాలర్లకు ట్రంప్ సర్కారు పెంచింది. దీని అమలు తేదీని మార్చి 15గా నిర్ణయించింది. అయితే దీనిని 60 రోజులు వాయిదా వేస్తూ ఈ నెల ప్రారంభంలో బైడెన్ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా 2022 నవంబర్ 14 వరకు గడువు పెంచింది. దీంతో హెచ్1బీ వీసాదారులకు ఊరట లభించినైట్లెంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Biden
- calculating
- H-1B
- visas
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

