Covaxin Vaccine | కొవాగ్జిన్ టీకాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సమీక్ష.. 24 గంటల్లో స్పష్టత!
Covaxin Vaccine |

జెనీవా : భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన కొవిడ్ టీకాపై సాంకేతిక కమిటీ సమీక్ష నిర్వహించనున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అధికార ప్రతినిధి మార్గరెట్ హారిస్ పేర్కొన్నారు. యూఎన్ బ్రీఫింగ్లో ఆయన ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. కమిటీ సంతృప్తి చెందితే రాబోయే 24 గంటల్లోపు అనుమతి లభిస్తుందని పేర్కొన్నారు. టీకా సురక్షితమైందని, ప్రభావవంతమైందని నిర్ధారించుకోవడానికి.. క్షుణ్ణంగా పరిశీలించి అంచనా వేయాల్సి ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ ఇప్పటికే స్పష్టం చేసింది. భారత్ బయోటెక్ కొవాగ్జిన్ టీకా ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ (EUL) కోసం ఏప్రిల్ 19న ప్రపంచ ఆరోగ్య సంస్థకు దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో పలుసార్లు ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ (ఈయూఎల్) కోసం భారత్ బయోటెక్ ప్రపంచ ఆరోగ్య సంస్థకు పూర్తి స్థాయిలో సమర్పించింది. కొవాగ్జిన్ టీకాను భారత్ బయోటెక్ ఐసీఎంఆర్‌తో కలిసి అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అత్యవసర వినియోగం కింద టీకాను వినియోగిస్తున్నారు. టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు లేకపోవడంతో విద్యార్థులు, పలువురు భారతీయులు ఇబ్బందులు పడుతున్నారు. ఈయూఎల్ గుర్తింపు వస్తే భారతీయులకు అంతర్జాతీయ ప్రయాణం సులభతరం కానున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

