బెర్లిన్: జర్మనీలోని బెర్లిన్(Berlin) నగరంలో ఇక నుంచి మహిళలు పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్(swimming pools)లో టాప్‌లెస్‌గా స్విమ్మింగ్ చేసుకునే వీలును కల్పించారు. బెర్లిన్ నగర అధికారులు ఈ విషయాన్ని ప్రకటించారు. ఓపెన్ ఎయిర్ పూల్‌లో సన్‌బాత్ (sunbathing)చేస్తున్న ఓ మహిళను ఇటీవల గెంటేశారు. దీంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పురుషుల తరహాలోనే మహిళలకు కూడా పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్‌లో టాప్‌లెస్(topless)గా స్విమ్మింగ్ చేసే సమానత్వం కల్పించాలని ఆమె డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో బెర్లిన్ అధికారులు కొత్త నియమాన్ని తీసుకువచ్చారు. బెర్లిన్ పూల్స్లోని విజిటర్స్ అందరూ టాప్‌లెస్‌గా వెళ్లవచ్చు అని తెలిపారు. ఇక బెర్లిన్‌లో స్విమ్మింగ్ పూల్స్ నడిపే సంస్థ ఈ నిర్ణయాన్ని స్వాగతించింది.