వాషింగ్టన్: టైమ్ మ్యాగ్జిన్ కవర్ పేజీపై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా(PM Sheikh Hasina) ఫోటోను ప్రచురించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరి తరం కాదు అని ఆమె ఆ మ్యాగ్జిన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. బంగ్లాదేశ్లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న నేపథ్యంలో ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. దేశ ప్రజలు తమతో ఉన్నారన్న నమ్మకంతో ఉన్నట్లు ఆమె వెల్లడించారు. ప్రజలే తన ప్రధాన బలం అని ఆమె పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ ప్రభుత్వాన్ని మార్చడం సులవైన విషయం కాదన్నారు. ప్రజల కోసం తన ప్రాణాలు ఇచ్చేందుకు రెఢీగా ఉన్నట్లు ఆమె చెప్పారు. నవంబర్ 20వ తేదీకి చెందిన ఎడిషన్ను ఈనెల 10వ తేదీన మార్కెట్లోకి రిలీజ్ చేయనున్నారు.
TIME’s new cover: Under Prime Minister Sheikh Hasina, democracy in Bangladesh hangs in the balance https://t.co/355ojZW1j1 pic.twitter.com/POMi7oRKD0
— TIME (@TIME) November 2, 2023