సిడ్నీ: ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్‌కు కరోనా సోకింది. వైరస్ పరీక్షలో ఆయన పాజిటివ్‌గా తేలారు. వైరస్ సోకడంతో ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఆయన చెప్పారు. ఫ్లూ లాంటి లక్షణాలతో పాటు జ్వరం కూడా ఉన్నట్లు మారిసన్ తెలిపారు. హెల్త్ గైడ్‌లైన్స్ ఫాలో అవుతున్నాని, సిడ్నీలోని తన ఇంట్లో ఐసోలేట్ అయినట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఐసోలేషన్‌లో ఉంటూనే తన విధులను నిర్వర్తించనున్నట్లు ఆయన చెప్పారు. మంగళవారం సాయంత్రం మారిసన్‌కు జ్వరం వచ్చింది. ఆ తర్వాత పరీక్ష చేసుకోగా.. కరోనా ఉన్నట్లు తేలింది.