కోవీషీల్డ్‌కు ఆమోదం తెలిపిన ఆస్ట్రేలియా

సిడ్నీ: కోవీషీల్డ్ టీకాకు ఆస్ట్రేలియా వైద్య నియంత్రణ మండలి ఆమోదం తెలిపింది. భారత్‌కు చెందిన సీరం సంస్థ .. కోవీషీల్డ్ కోవిడ్ టీకాలను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. కోవీషీల్డ్ టీకా తీసుకున్న భారతీయులు ఇక నుంచి ఆస్ట్రేలియాలో పర్యటించవచ్చు. ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వేలాది మంది ఇండియన్లకు ఊరటనిచ్చింది. కోవీషీల్డ్‌తో పాటు చైనాకు చెందిన సైనోవాక్ టీకాలు ఇస్తున్న రక్షణ పట్ల ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ సంతృప్తి వ్యక్తం చేశారు. మరో వైపు అంతర్జాతీయ ప్రయాణికులపై ఉన్న ఆంక్షలను కూడా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఎత్తివేయనున్నది. నవంబర్ నుంచి విదేశీ ప్రయాణికులు రావచ్చు అంటూ ఇవాళ ఆ దేశం ప్రకటించింది. అంతర్జాతీయ ప్రయాణికులపై గత 18 నెలలుగా ఉన్న నిషేధాన్ని ఆస్ట్రేలియా ఎత్తివేసింది. సైనోవాక్, కోవీషీల్డ్ టీకాలు వేసుకున్న అంతర్జాతీయ ప్రయాణికులకు ఆటంకాలు ఉండవని స్కాట్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

