New York Airport: న్యూయర్క్ ఎయిర్‌పోర్టులో ఢీకొన్న ట్రక్కు, విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
New York Airport: న్యూయార్క్ విమానాశ్రయంలో ప్రమాదం జరిగింది. ట్రక్కు, విమానం ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ప్రస్తుతం లా గార్డియా విమానాశ్రయంలో రాకపోకల్ని నిలిపివేశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతిచెందగా, ఇద్దరు ఫైర్ ఫైటర్లు గాయపడ్డారు.
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న లా గార్డియా విమానాశ్రయం(New York Airport)లో .. ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన విమానాన్ని ట్రక్కు ఢీకొన్నది. ఫ్లయిట్ రేడార్24 వెబ్సైట్ ప్రకారం ఆ విమానాశ్రయంలో ప్రస్తుతం రాకపోకలు స్తంభించాయి. ఎయిర్‌పోర్టులోని నాలుగవ రన్‌వేపై ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది. ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్, రన్‌వే దగ్గర ఉన్న ఫైర్ ఇంజిన్ ఢీకొన్నట్లు సమాచారం ఉన్నది. ఈ ఘటనకు చెందిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. విమానం ముక్కు భాగం చాలా ఎత్తుకు లేచినట్లు కొన్ని వీడియోల ద్వారా తెలిసింది. కెనడా విమానంలోని ప్రయాణికులను దించేశారు. అన్ని విమానాలను నిలిపివేస్తున్నట్లు అమెరికా విమానయాన సంస్థ పేర్కొన్నది. అయితే ఎంత మంది గాయపడ్డారు, ఏ స్థాయిలో నష్టం జరిగిందన్న విషయాన్ని అధికారులు వెల్లడించలేదు. తాజా సమాచారం ప్రకారం ఇద్దరు ప్రయాణికులు మృతిచెందినట్లు తెలుస్తోంది.
🚨 BREAKING UPDATE: MULTIPLE CRITICAL PATIENTS AFTER AIR CANADA FLIGHT COLLIDES WITH VEHICLE WHILE LANDING AT LAGUARDIA AIRPORT. POSSIBLE FATALITIES. https://t.co/hZWimAuwe5 pic.twitter.com/62SUgxoUkA
— Breaking911 (@Breaking911) March 23, 2026
ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతిచెందగా, ఇద్దరు ఫైర్ ఫైటర్లు గాయపడ్డారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
Endometriosis | ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి..
Bharateeyudu 3 | ‘భారతీయుడు 3’ వర్సెస్ ‘స్పిరిట్’, ‘వారణాసి’.. ఈ బాక్సాఫీస్ పోరులో శంకర్ నిర్ణయం ఏంటి?
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

