Cyclone Freddy | తుపాను బీభత్సం.. 100 మందికి పైగా దుర్మరణం
Cyclone Freddy | ఆఫ్రికా దేశమైన మలావిలో ఫ్రెడ్డీ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తుపాను కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదల ఉధృతికి ఎక్కడికక్కడ భవనాలు కూలిపోతున్నాయి. జనాలు కొట్టుకుపోతున్నారు. ఈ తుపాను ధాటికి 100కి పైగా మరణించినట్లు తెలుస్తోంది.
Cyclone Freddy | ఆఫ్రికా దేశమైన మలావిలో ఫ్రెడ్డీ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తుపాను కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదల ఉధృతికి ఎక్కడికక్కడ భవనాలు కూలిపోతున్నాయి. జనాలు కొట్టుకుపోతున్నారు. ఈ తుపాను ధాటికి 100కి పైగా మరణించినట్లు తెలుస్తోంది. వీరిలో ఇప్పటివరకు 60 మంది మృతదేహాలను గుర్తించారు. నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఫ్రెడ్డీ తుపాను ధాటికి మలావి, మొజంబిక్ సహా పలు దక్షిణ, మధ్య ఆఫ్రికా దేశాలు అతలాకుతులం అవుతున్నాయి. వరదల కారణంగా పలు ప్రాంతాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భవనాలతో పాటు చెట్లు కూలిపోయి.. కొండ చరియలు విరిగి పడటంతో భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే తీవ్ర గాలులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

