Cosmic Hum: అంతరిక్ష శబ్ధాలను పసిగట్టిన సైంటిస్టులు.. కీలక పాత్ర పోషించిన భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు
Cosmic Hum: అంతరిక్షంలో వినిపిస్తున్న శబ్ధాలకు చెందిన బ్యాక్‌గ్రౌండ్ స్వరాలను గుర్తుపట్టినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్రవేత్తులు గురువారం ప్రకటన చేశారు. దీంట్లో భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు కూడా కీలక పాత్ర పోషించారు. పుణెలో ఉన్న రేడియో టెలిస్కోప్‌కు ఆ ధ్వని తరంగాలు చిక్కినట్లు నిర్ధారించారు.
న్యూఢిల్లీ: అంతరిక్షంలో ప్రతిధ్వనిస్తున్న శబ్ధాలకు చెందిన గుట్టును ఖగోళ శాస్త్రవేత్తలు(Astrophysicsts) విప్పారు. గురుత్వాకర్షణ తరంగాల నుంచి వస్తున్న ఆ ధ్వనులకు చెందిన కీలక ప్రటకన చేశారు. అంతరిక్షంలో వినిపిస్తున్న శబ్ధాలకు చెందిన బ్యాక్‌గ్రౌండ్ స్వరాలను గుర్తుపట్టినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్రవేత్తులు గురువారం ప్రకటన చేశారు. దీంట్లో భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు కూడా కీలక పాత్ర పోషించారు. పుణెలో ఉన్న రేడియో టెలిస్కోప్‌కు ఆ ధ్వని తరంగాలు చిక్కినట్లు నిర్ధారించారు. దాదాపు 15 ఏళ్ల నుంచి ఆ డేటాను సేకరిస్తున్నట్లు ఆస్ట్రోఫిజిస్టులు వెల్లడించారు. నక్షత్రాలు, పాలపుంతలు.. దాటుతూ సుదూర తీరాల నుంచి ఆ హమ్మింగ్ వస్తున్నట్లు తెలిపారు.
గెయింట్ మెట్రీవేవ్ రేడియో టెలిస్కోప్(Giant Metrewave Radio Telescope)తో పాటు బెంగుళూరులోని రామన్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు కాస్మిక్ ధ్వని గుర్తింపులో కీలక పాత్ర పోషించారు. నార్త్ అమెరికన్ నానోహెట్జ్ అబ్జర్వేటరీ ఫర్ గ్రావిటేషన్ వేవ్స్ బృందం ఆధ్వర్యంలో ఈ అధ్యయనం సాగింది. ఇండియాతో పాటు కెనడా, యూరోప్, చైనా, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు ఈ స్టడీలో పాల్గొన్నారు. ఎన్నో ఏళ్లు శ్రమించి వాళ్లు డేటాను సేకరించారు.
పల్సర్స్ అనే మండిన నక్షత్రాలను శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. ఆ నక్షత్రాల నుంచి గురుత్వాకర్షణ తరంగాలు వస్తున్నట్లు గుర్తించారు. ఆ తరంగాలు చాలా శక్తివంతంగా ఉన్నట్లు నిర్ధారించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు గడిచిన 18 ఏళ్లలో 115 పల్సర్స్ గురించి స్టడీ చేసినట్లు పేర్కొన్నారు. ఆ పల్సర్స్ మిలియన్ల రెట్లు శక్తివంతమైన గురుత్వాకర్షణ శబ్ధాలను సృష్టిస్తున్నట్లు తేల్చారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా జట్టు ఎంపిక
K-Hub | కాకతీయ యూనివర్సిటీ కే-హబ్‌కు వృథా ఖర్చు..! కోట్ల భవనం నిరుపయోగం
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Kubheer | భూముల రీసర్వే పనులు పారదర్శకంగా నిర్వహించాలి : సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్
Green Crackers: ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చు: సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

